గుంటూరు: తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ అమరావతి ప్రాంతంలో ఉద్రిక్తలకు కారణమయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూర్ రేంజ్ ఐజీ వినీత్ బ్రిజాల్ హెచ్చరించారు. ముఖ్యంగా తమిళనాడులో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి జరిగినట్లుగా కొంతమంది ఉద్దేశ పూర్వకంగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతూ ఉద్రిక్తతలకు కారణమవుతున్నారని అన్నారు. అలాంటి వారిని గుర్తించి ఇలాంటి ఫేక్ న్యూస్ ను అడ్డుకోడానికి చర్యలు తీసుకున్నట్లు ఐజీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.  

ఉద్రిక్తతలకు  కారణమయ్యే ఇలాంటి వీడియోలతో ట్రోల్ చేస్తూ ప్రశాంతంగా వున్న రాజధానిలో అల్లర్లు సృష్టించవద్దని సూచించారు. ఇటువంటి అసత్యమైన  వార్తలను ప్రసారం చేసినా , ఇతరులకు షేర్ చేసినా, ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యహరించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి వార్తలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐజీ హెచ్చరించారు. 

తల్లిని చంపి ఇంట్లో 36 గంటల పాటు శవంతో హంతకుడు

ఇక గుంటూరు ఎస్పీ మాట్లాడుతూ...144 సెక్షన్‌, 30 పోలీసు యాక్ట్‌ అమల్లో ఉందని ముందుగానే ప్రకటించామని తెలిపారు. కాబట్టి నిబంధనలను, నిషేద ఆజ్ఞలను అతిక్రమిస్తూ ఉద్రిక్తతలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు. ప్రజలు ఆవేశానికి లోనవకుండా సంయమనంలో  ఉండాలని ఎస్పీ  సూచించారు. 

సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే గంటల వ్యవధిలో అరెస్టు చేస్తామన్నారు.  సైబర్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. నకిలీ వీడియోలు వైరల్‌ చేస్తున్న వారిపై మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు వార్నింగ్ ఇచ్చారు.

మందడంలో ఉద్రిక్తత: 'ఏపీలో ఉన్నామా, పాక్‌లో ఉన్నామా

తుళ్లూరులో ట్రాన్స్ఫార్మర్ పట్టుకుని రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు. పోలీసులు ఎవరిపైనా దాడి చేయలేదని... మహిళలపై లాఠీఛార్జి చేశామన్నది కూడా అవాస్తవమన్నారు.  మహిళలను మహిళా కానిస్టేబుళ్లే  అడ్డుకున్నారని... తమ అదుపులో ఉన్న వారు ఎవరు మరణించలేదని ఎస్పీ స్ఫష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని... చట్టవిరుద్ధంగా ఒకేసారి గుంపుగా రావడం వల్లే మహిళలను అడ్డుకున్నట్లు ఎస్పీ వివరించారు.