Asianet News TeluguAsianet News Telugu

మందడంలో ఉద్రిక్తత: 'ఏపీలో ఉన్నామా, పాక్‌లో ఉన్నామా'

రాజదానిని అమరావతిలోనే ఉంచాలని కోరుతూ రైతుల ఆందోళన శుక్రవారం నాటికి 24వ రోజుకు చేరుకొంది. మందడంలో ఇవాళ ఉద్రిక్తత చోటు చేసుకొంది. 

Amaravathi protest:Tension prevails at mandadam village
Author
Amaravathi, First Published Jan 10, 2020, 1:01 PM IST

అమరావతి:  మందడం గ్రామానికి చెందిన రైతులకు పోలీసులకు మధ్య  పోలేరమ్మ గుడి వద్ద  తోపులాట చోటు చేసుకొంది. విజయవాడకు వెళ్లకుండా పలువురిని పోలీసులు  అదుపులోకి తీసుకొన్నారు.

Also read:విజయవాడకు పాదయాత్ర, రైతుల అరెస్ట్: గ్రామాల్లో టెన్షన్

విజయవాడలో అమ్మవారికి నైవేద్యం, గాజులు, పసుపు, కుంకుమ ఇచ్చేందుకు గాను జేఎసీ ఆధ్వర్యంలో స్థానికులు విజయవాడకు ర్యాలీగా బయలుదేరారు. మరోవైపు మందడం లోని పోలేరమ్మ వద్ద పాదయాత్రకు వెళ్లేవారిని పోలీసులు అడ్డుకొన్నారు. 

Also read:సీమలో హైకోర్టు పెడితే.. పది జిరాక్స్ షాపులు వస్తాయి, ఇంకేం లేదు: జేసీ వ్యాఖ్యలు

మందడంలో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకొంది.శుక్రవారం అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి పోలీసుల అనుమతి కావాలా అంటూ మహిళలు పోలీసులను నిలదీశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామా పాకిస్తాన్‌లో ఉన్నామా అని మహిళలు ప్రశ్నించారు. గుడికి వెళ్లేందుకు ఇంతమంది పోలీసులు అవసరమా అని మందడం గ్రామానికి చెందిన మహిళలు ప్రశ్నించారు. 

అమ్మవారికి పొంగళ్లు పెడుతుంటే పోలీసులు అడ్డుకోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము  ఆందోళన చేస్తున్నామా అమ్మవారిని దర్శించుకోవడం తప్పా? అని రైతులు ప్రశ్నల వర్షం కురిపించారు.  ఈ సమయంలో మందడంలో పోలేరమ్మ గుడి వద్ద రైతుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

మందడంలోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి  రైతులను అరెస్ట్ చేశారు. గుడికి వెళ్తోంటే అక్రమంగా అరెస్ట్ చేశారని రైతులు మండిపడ్డారు. తుళ్లూరు మండలం పెద్దపరిమిలో ఉద్రిక్తత చోటు చేసుకొంది. పెద్దపరిమికి చెందిన ప్రసాద్ పోలీసుల వైఖరిని నిరసిస్తూ రెండు అంతస్తుల డాబా ఎక్కిన ప్రసాద్.

Follow Us:
Download App:
  • android
  • ios