అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ప్రస్తుత సీఎస్ ను బాపట్ల హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌గా బదిలీచేసి ఇంచార్జీ సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్‌ను ప్రభుత్వం నియమించారు. ఈ  మేరకు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

అయితే ఇలా హటాత్తుగా సీఎస్ ను మార్చడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే పలువురు ఈ నిర్ణయాన్ని తప్పుబట్టగా తాజాగా ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎస్, బిజెపి నాయకులు ఐవైఆర్ కృష్ణారావు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

''సీఎస్ ను తొలగించే అధికారం సీయమ్ గారికి ఉన్న ఈ తొలగించిన విధానం సరిగా లేదు. బాధ్యత లేని అధికారం చలాయించే ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రుల మెడలకు ఉచ్చులా చుట్టుకుంటూ ఉన్నది. హిందూ దేవాలయాల్లో అన్య మతస్తులను తొలగించే విషయంలో గట్టిగా నిలబడి నందుకు ఇది బహుమానం అయితే ఇంకా మరీ దారుణం.'' అంటూ మాజీ సీఎస్ ఐవైఆర్ ట్విట్టర్ వేదికన ఘాటుగా స్పందించారు. 

 read more షోకాజ్ నోటీసుల ఎఫెక్ట్: ఎల్వీ బదిలీ, కొత్త సీఎస్ రేసులో వీరే..

సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ ఇటీవల కాలంలో బిజినెస్ రూల్స్ మార్చడంతో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సీరియస్ అయ్యారు. ఈ మేరకు ప్రవీణ్ ప్రకాష్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే సీఎం ఆదేశాల మేరకే  ప్రవీణ్ ఈ ఆదేశాలు జారీ చేసినట్టుగా  సమాచారం. అయితే ఇది తనకు తెలియకుండానే జరగడంతో సీఎస్ అతడిపై చర్యలు తీసుకున్నారు. 
 
ఈ వ్యవహరం ఏపీ సీఎం వైఎస్ జగన్ కు , సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం మధ్య అగాధం పెరిగిందనే ప్రచారం సాగుతోంది. దీంతో తన ప్రిన్సిపల్ సెక్రటరీకి షోకాజ్ నోటీసులు జారీ చేశాడన్న అసంతృప్తితో  సీఎస్ బదిలీ చేసినట్టుగా సమాచారం.

 మరో వైపు ఏపీ సీఎస్ గా నీలం సహాని, సమీర్ శర్మల పేర్లను  ప్రభుత్వం ఏపీ సీఎస్‌గా నియమించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా సమాచారం.నీలం సహాని 1984 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి. సమీర్ శర్మ 1985 బ్యాచ్ అధికారి. సమీర్ శర్మ ప్రస్తుం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. నీలం సహాని 2020 జూన్ 30వ తేదీన రిటైర్ కానున్నారు.

read more  జనం నీ వెంటవుంటే... రెండు చోట్లా ఎందుకు ఓడిపోతావు: పవన్‌పై కొడాలి నాని ఫైర్

 సమీర్ శర్మ 2021 నవంబర్ 30వ తేదీన రిటైరౌతారు. మరో వైపు కేంద్ర సర్వీసుల్లో ఉన్న అజయ్ సహాని కూడ 1984 బ్యాచ్ అధికారి. అజయ్ సహాని 2022 ఫిబ్రవరి 28న రిటైర్ కానున్నారు. అజయ్ సహాని కూడ  సీఎస్ పదవి రేసులో ఉన్నారు.
 
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వీ సుబ్రమణ్యం ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల సమయంలో  ఈసీ ఆదేశాల మేరకు ఏపీ సీఎస్ అనిల్ పునేఠాను బదిలీ చేసి ఎల్వీ సుబ్రమణ్యాన్ని నియమిస్తూ ఆ సమయంలో ఈసీ ఆదేశాలను జారీ చేసింది.ఈ ఆదేశాల మేరకు ఎల్వీ సుబ్రమణ్యం ఏపీ ప్రభుత్వ సీఎస్‌గా  నియమితులయ్యారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడ  ఎల్వీసుబ్రమణ్యాన్ని కొనసాగిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకొంది.