Asianet News TeluguAsianet News Telugu

సీఎం జగన్ తో దేవినేని అవినాశ్ భేటీ... వైసిపీలో చేరిక

టిడిపి యువ నాయకులు దేవినేని అవినాశ్ పార్టీ మార్పు అంశం గతకొంతకాలంగా విజయవాడ రాజకీయాల్లో సంచనలంగా మారింది. అయితే మరికొద్దిసేపట్లో దీనిపై క్లారిటీ రానుంది.  

devineni avinash meeting with ap cm jagan at tadepalli
Author
Guntur, First Published Nov 14, 2019, 4:12 PM IST

తాడేపల్లి: తెలుగుదేశం పార్టీకి గురువారం ఉదయమే రాజీనామా చేసిన యువ నాయకుడు దేవినేని అవినాశ్ భవిష్యత్ కార్యాచరణ ప్రారంభించారు.  ఇందులో భాగంగా ఇప్పటికే ఆయన అధికార వైసిపిలో చేరాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. దీనికి మరింత బలాన్ని చేకూరుస్తూ ఆయన వైసిపి అధ్యక్షులు, సీఎం జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని  నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య చర్చ జరుగుతోంది. 

తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తెలుగు యువత అధ్యక్ష పదవికి  ఉదయమే అవినాశ్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా పంపించారు. 

ఇకపోతే గత కొద్దిరోజులుగా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు దేవినేని అవినాష్. టీడీపీలో తగిన గౌరవం లభిచండం లేదంటూ పలుమార్లు వాపోయారు కూడా. అటు దేవినేని నెహ్రూ అభిమానులు సైతం టీడీపీలో తమకు అవమానం జరుగుతుందంటూ ఆరోపించారు. 

read more  వైసీపీలోకి అవినాష్.. వల్లభనేని వంశీ అలక....? కారణమేమిటంటే!

ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం గుణదలలోని తన స్వగృహంలో దేవినేని నెహ్రూ అనుచరులు, అభిమానులతో భేటీ అయ్యారు అవినాష్. కార్యకర్తలు, దేవినేని నెహ్రూ అభిమానులు అంతా అవినాష్ కు టీడీపీలో జరుగుతున్న అవమానాలను ఎత్తిచూపారట. పార్టీలో సముచిత స్థానం ఇవ్వడం లేదని, కనీసం గౌరవించడం లేదని మండిపడ్డారు.   

అలాగే నెహ్రూ అభిమానులకు తెలుగుదేశం పార్టీలో గుర్తింపు లేదని అవినాష్ ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో ఉంటూ అవమానాలను ఎదుర్కొనే కన్నా వైసీపీలో ఉంటే మంచిదని అవినాష్ కు సూచించారు.   

అభిమానులు, కార్యకర్తల అభిప్రాయమే తన అభిప్రాయమని సమావేశంలో స్పష్టం చేసిన దేవినేని అవినాష్ గురువారం టీడీపీకి రాజీనామా చేశారు. దేవినేని అవినాష్ వైసీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతుంది. 

video news : తెలుగుదేశానికి యువరక్తం అవసరం...రాబోయే మూడేళ్లలో యువనాయకత్వం

సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు అవినాశ్ రాజీనామా ప్రకటన వెలువడగానే ప్రచారం మొదలయ్యింది. దీన్ని నిజం చేస్తూ వీరిద్దరి మధ్య భేటీ జరుగుతుండంతో ఇక అవినాశ్ చేరిక కూడా లాంఛనంగానే కనిపిస్తోంది.  గన్నవరం నియోజకవర్గంలో జరిగే ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ బరిలోకి దిగుతారంటూ ప్రచారం జరుగుతుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios