విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజధానిలో పర్యటించే నైతిక హక్కులేదని విజయవాడ తూర్పు వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. గత ఐదు సంవత్సరాలలో రాజధానిపై మీటింగ్ లు నిర్వహించడమే తప్ప ఎక్కడా...ఎప్పుడు తిరిగిన పాపాన పోలేదని అన్నారు. 

ఆంధ్ర ప్రదేశ్ ను భ్రష్టు పట్టించాలనే టిడిపి నేతలు, కార్యకర్తల ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. 13 జిల్లాలో చంద్రబాబు చేపడుతున్న కార్యకర్తల సమావేశాలలో ప్రతి ఒక్క కార్యకర్త చంద్రబాబును నిలదీస్తున్నారని తెలిపారు. 

గత ప్రభుత్వంలో పనులు పూర్తి చేసిన వారికి కనీసం బిల్లులు కూడా చెల్లించలేదన్నారు. అమరావతిలో భాగమైన మంగళగిరిని అభివృద్దిని టిడిపి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేదన్నారు. 

read more  అమరావతిపై చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ నేను కట్టుబడే వున్నా: బొత్స

గతంలో ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతులే ఇప్పుడు చంద్రబాబును నిలదీస్తున్నారని అన్నారు. రాజధానికి అభివృద్ధికి భూములు ఇచ్చిన రైతుల బిడ్డలకు ఉచిత విద్య, జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు 365 రోజులు పని కల్పిస్తానని ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. 

రాజధానికి శంకుస్థాపన స్థాపన చేసిన తరువాత ఎపుడైనా చంద్రబాబు అమరావతి ప్రాంతానికి వెళ్ళారా అని నిలదీశారు. బహిరంగ సభలలో మోదీ మట్టి, నీళ్లు తప్ప మనకి ఏమి ఇవ్వలేదు అని చెప్పిన మాటలు వాస్తవం కాదా అని అడిగారు. టిడిపి నేతలు పెయిడ్ ఆర్టిస్టులతో ఈరోజు రాజధానిలో హడావుడి చేశారని అన్నారు. 

read more  ఆ అమరావతి నిర్మాణం నిజంగానే ఆగిపోయింది...: డిప్యూటీ సీఎం సంచలనం

శుక్రవారం నుండి తాను తూర్పు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు అవినాశ్ ప్రకటించారు. నియోజకవర్గ పరిధిలోని వైసిపి పార్టీని మరింత బలోపేతం చేయడమే కాదు ప్రజల సమస్యల గురించి తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ఈ పర్యటన చేపడుతున్నట్లు అవినాష్ వెల్లడించారు.