కరోనా తెచ్చిన కష్టాలు... పరువు పోయిందంటూ ఓ కుటుంబం ఆవేదన

కరోనా వైరస్ వల్ల తమ కుంటుంబ పరువు పోయిందంటూ ఓ మైనారిటీ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసిన సంఘటన రాజధాని ప్రాంతంలో చోటుచేసుకుంది. 

Corona Virus Effect on minority family at thadepally

తాడేపల్లి: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్ లో కూడా వ్యాపిస్తోంది. వేగంగా కాకపోయినా మెళ్లిగానే కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇరు తెలుగురాష్ట్రాల్లో కూడా ఈ వైరస్ ప్రభావం కనిపిస్తోంది. ఈ  నేపథ్యంలో విదేశాల నుండి వచ్చినవారికి క్వారంటైన్ చేస్తున్న అధికారులు వారికి కరోనా లక్షణాలు లేకుంటేనే ఇతరులను కలవడానికి  అనుమతిస్తున్నారు. అయితే ఇలా ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల తమ కుటుంబ పరువు పోయిందంటూ ఓ మైనారిటీ వర్గానికి చెందిన కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. 

తాడేపల్లికి చెందిన ఓ మైనారిటీ కుటుంబం ఇటీవలే ఆద్యాత్మిక యాత్రలో భాగంగా విదేశాలకు వెళ్లొచ్చారు. ఈ క్రమంలోనే వారికి కరోనా వైరస్ ఏమయినా సోకిందా అన్న అనుమానంతో వైద్యాధికారులు వారి ఇంటికి వెళ్లి  కుటుంబసభ్యులందరికి పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ పరీక్షల్లో తమ కుటుంబీకులెవ్వరికీ వైరస్ సోకినట్లు నిర్ధారణ కాలేదని తెలిపారు. 

read more  స్థానికసంస్థలపై సుప్రీం తీర్పు... మంచి పరిణామమే: వెల్లంపల్లి శ్రీనివాస్

అయితే మున్సిపల్ అధికారులు పూర్తిగా నిర్దారించుకోకుండా తమ నివాసం చుట్టూ బ్లీచింగ్ పౌడర్ చల్లారని... దీంతో తమ కుటుంబానికి కరోనా సోకిందన్న ప్రచారం మొదలయ్యిందన్నారు. దీంతో తమ నివాసానికి బంధువులు, చుట్టుపక్కల వారు రావటానికి సాహసించట్లేదని... కరోనా భయంతో తమతో కనీసం మాట్లాడటానికి  కూడా ఇష్టపడటం లేదన్నారు. 

మున్సిపల్ అధికారులు తీసుకోవాల్సిన దగ్గర చర్యలు తీసుకోకుండా తమలాంటి వారిని అవమాన పర్చారని సదరు కుటుంబం వాపోతోంది. తమను దాదాపు సమాజం వెలేసినట్లు చూస్తోందన్నారు. కరోనా  వైరస్ వ్యాప్తి  చెందకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే కానీ దానిపై  ప్రజల్లో కూడా అవగాహన కల్పించాలని కోరారు.  అప్పుడే తమలాగ ఎవ్వరు ఆవేదనకు గురవకుండా వుంటారని అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios