మూడు రాజధానులపై మండలిలో చర్చ... బిజెపి స్టాండ్ ఇదే: ఎమ్మెల్సీ సోము వీర్రాజు
ఆంధ్ర ప్రదేశ్ రాజధానిపై శాసనమండలిలో జరగుతున్న గందరగోళంపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందిస్తూ తమ పార్టీ స్టాండ్ ఏమిటో తెలిపారు.
అమరావతి: ఇప్పటివరకు భారతదేశంలో చాలారాష్ట్రాలు విడిపోయాయని... కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు రాజధానులు కట్టుకోవడం సర్వసాధారణమని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. అయితే ఎక్కడ కూడా ఆంధ్ర ప్రదేశ్ రాజధానిపై జరుగుతున్నంత చర్చ జరగలేదని... ఇప్పటికైనా రాజధానిపై కాకుండా అభివృద్దిపై దృష్టిసారించాలని సోము వీర్రాజు సూచించారు.
శ్రీబాగ్ ఒప్పందంలో చెప్పినట్లు కర్నూలుకు హైకోర్ట్ రావడాన్ని స్వాగతిస్తున్నట్లు వీర్రాజు పేర్కొన్నారు. అయితే ఇదొక్కటి మాత్రమే రాయలసీమ వెనుకబాటును దూరం చేయదని... ఆ ప్రాంత అభివృద్దిపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ప్రభుత్వాన్ని సూచించారు.
ఏ రాష్ట్రంలో కూడా రాజధాని గురించి ఇంత గందరగోళం చెలరేగలేదన్నారు. కేవలం రాజధాని వల్లే అభివృద్థి జరుగుతుందా? అంటూ ఆయన అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపిని ప్రశ్నించారు. ప్రస్తుత పరిణామాలతో ప్రజలకు ఏ రకమైన సంకేతాలు పంపుతున్నారని నిలదీశారు.
read more బలహీన వర్గం వాడినే... కానీ బలహీనున్ని కాదు : టిడిపికి తమ్మినేని హెచ్చరిక
ఏపిలోని పదమూడు జిల్లాలను కూడా హైదరాబాద్ మోడల్ లో అభివృద్థి చేయాలని సూచించారు. గతంలో టిడిపి ప్రభుత్వం అమరావతి అని పెద్ద మైథాలజీని ముందుకు తెచ్చిందని... ఇప్పుడు వైసిపి ప్రభుత్వం విశాఖలో వెయ్యి కోట్లతో భవనాలు కడతారని చెబుతున్నారని సోము వీర్రాజు గుర్తుచేశారు.
నిన్నటి వరకు టిడిపి నేతలు గాడిద బొమ్మతో కేంద్రాన్ని పోలుస్తూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారని అన్నారు. ఇప్పుడు ప్రధాని మోదీ బొమ్మను ముందు పెట్టుకుని ఉద్యమాలు చేస్తున్నారని అన్నారు. అధికారం అనేది శాశ్వతం కాదని కేవలం చేసే అభివృద్థి అనేది శాశ్వతమని అన్నారు.
విశాఖకు 1500 కోట్లతో నాలుగేళ్ల పాటు కేంద్రం అభివృద్థి చేసిందన్నారు. హుద్ హుద్ తుఫాన్ వల్ల నష్టపోయిన విశాఖకు కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేయడమే కాదు మరెన్నో రకాలుగా ఆదుకుంది. అంతేకాకుండా స్మార్ట్ సిటీగా విశాఖను గుర్తించిందన్నారు.
గడిచిన అయిదేళ్ళలో టిడిపి ప్రభుత్వం ఏపిలో కనీసం ఒక్క పోర్ట్ కూడా కట్టలేక పోయిందని విమర్శించారు. 900 కిలోమీటర్ల తీర ప్రాంతం వుండి ఒక్క బెర్త్ కట్టలేక పోయారని విమర్శించారు.
read more పవన్ కల్యాణ్ జాగ్రత్త...అలాగే చేస్తే రాష్ట్రంలో తిరగలేవు: మంత్రి వార్నింగ్
బిజెపి పార్టీ మూడు ప్రాంతీయ బోర్డ్ లు కావాలని...హైకోర్ట్ కర్నూలులో పెట్టాలని గతంలో కోరినట్లు తెలిపారు. అమరావతిని రాజధానిగా అన్ని తీర్చిదిద్దుతామని చెప్పామని గుర్తుచేశారు. అయితే అమరావతి నిర్మాణం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలా సాగిందంటూ వీర్రాజు టిడిపి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.