గుంటూరు: రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం చాలా మంచిదేనని.... సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్నివ్యక్తిగతంగా స్వాగతిస్తున్నానని బిజెపి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. తెలుగును పూర్తిగా విస్మరించకుండా పిల్లలకు ఇంగ్లీష్ నేర్పితే చాలా మంచి ఫలితాలు వస్తాయని... విద్యార్థులు కూడా పోటీ ప్రపంచానికి తగ్గట్లుగా తయారవుతారని అన్నారు. అయితే ఈ నిర్ణయాన్ని తమ పార్టీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఎందుకు వ్యతిరేకించారో అర్థం కావడంలేదని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. 

రాష్ట్రంలో ఇసుక కొరత ఉందని....అందులో ఏమాత్రం అనుమానం లేదని బిజెపి మాజీ ఎమ్మెల్యే  విష్ణు కుమార్ రాజు అన్నారు. ఈ ఇసుక కొరత వల్ల రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ రంగమంతా కుదేలయ్యిందని....దీంతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని అన్నారు. 

read more  టిడిపిని వీడకూడదనే అనుకున్నా... కానీ వారివల్లే...: దేవినేని అవినాశ్

''దారుణాతి దారుణంగా పరిస్ధితి ఉంది.. పాత పద్దతినే కొనసాగించి ఉంటే ఎలాంటి సమస్య ఉండేది కాదు. ఆధార్ కార్డు ఉంటే చాలు బ్రోకర్లు ఇసుకను ఆన్లైన్ లో  చేసి పక్కదారి పట్టిస్తున్నారు.  ఇసుక సమస్య తీర్చలేక పోవడమే ఈ ప్రభుత్వ దురదుష్టం.  అమరావతి 32 వేలు భూమి అవసరం లేదని గతంలో శాసనసభలోనే చెప్పా. అమరావతిలో నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోంది.'' అని అన్నారు. 

''అమరావతిలో అసెంబ్లీ, సచివాలయం ఉంచి మిగిలినవి ఇతరప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. డీ సెంట్రలైజేషన్ చేసి అభివృద్ది చేయాలి లేదంటే హైదరాబాద్ పరిస్ధితి వస్తుంది.'' అభిప్రాయపడ్డారు. 

read more  సీఎం జగన్ తో దేవినేని అవినాశ్ భేటీ... వైసిపీలో చేరిక

''రాష్ట్రంలో సిమెంట్ ధరల పెంపుతో  దోపిడీ కి సిమెంట్ తయారీ సంస్ధలు తెరతీశాయి. నిర్మాణాలు లేకపోయినా సిమెంట్ ధరలను విపరీతంగా పెంచారు.   అందరూ కలసి సిమెంట్ ధరలను విపరీతంగా పెంచారు. సీఎం వెంటనే సిమెంట్ ధరల తగ్గింపుపై దృష్టి సారించాలి'' అని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. 

వీడియో

"