విద్యారంగానికి మేం చేసిందిదే...: అచ్చెన్నాయుడు
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఆంధ్ర ప్రదేశ్ లో విద్యాశాఖకు అత్యధికంగా నిధులు కేటాయించామని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
అమరావతి: టిడీపీ చేసిన అభివృద్ది పనులకు వైసీపీ రంగులు వేసి అదే నాడు నేడుగా చిత్రీకరించాలని చూస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ది పేరుతో తీసుకువచ్చిన ఈ కార్యక్రమం ఒక ఫాల్స్ గా మారిందన్నారు.
నాడు-నేడు కార్యక్రమం ద్వారా 15,715 ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి దశలో రూ.3,600 కోట్లు ఖర్చు చేస్తున్నామంటూ ప్రభుత్వం ప్రగల్బాలు పలికిందన్నారు. వైసిపి ప్రభుత్వానికి రంగులు మార్చడం మీద ఉన్న శ్రద్ద విద్యా రంగం మెరుగుపరచడం మీద లేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
అమ్మ ఒడి పథకం ద్వారా 80 లక్షల పిల్లలను మోసం చేశారని అన్నారు. ఈ పథకం కింద డబ్బులు పొందిన లబ్దిదారుల నుంచి రూ.1000 కమీషన్ దండుకోవడం వైసీపీ నేతల ముడుపుల వసూళ్లకు పరాకాష్టగా నిలించిందని ఆరోపించారు. ఈ పథకానికి బడ్జెట్ లో నిధులు కేయించకుండా బడుగు బలహీన వర్గాలు, వెనకబడిన వర్గాల నిధులు మళ్లించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పొట్టకొట్టారని అన్నారు.
టిడిపి హయాంలో విధ్యారంగానికి బడ్జెట్ 5 ఏళ్లలో రూ. 10 వేల కోట్లు అదనంగా పెంచామన్నారు. అలాంటిది ఈ ప్రభుత్వం బడ్జెట్ లో విద్యారంగానికి రూ.31,618 కోట్లు కేటాయించి ఎంత ఖర్చు చేసిందో చెప్పాలి? అని ప్రశ్నించారు.
స్కాలర్‌షిప్స్‌కు అమ్మ ఒడి పేరిట మంగళం పలుకుతున్నారని అన్నారు. గత 8 నెలలుగా విద్యార్ధులకు స్కాలర్‌షిప్ ఇవ్వకపోవడం విద్యార్ధులకు అన్యాయం చేయడం కాదా? అని ప్రశ్నించారు. విద్యార్ధులకు పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో ప్రభుత్వం స్కాలర్‌షిప్స్, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడం పాదయాత్రలో హామీ ఇచ్చిన విధ్యార్దులకు ద్రోహం చేయటమేనని అన్నారు.
read more వివేకా హత్యకేసులో వెనక్కితగ్గిన జగన్... మా అనుమానాలివే..: వర్ల రామయ్య
తెలుగుదేశం ప్రభుత్వం 5 ఏళ్లల్లో రూ.14,696 కోట్లను కేవలం స్కాలర్‌షిప్స్ కింద ఖర్చు చేసిందని తెలిపారు. కానీ జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు నయాపైసా ఉపకార వేతనాలకు ఇవ్వలేదన్నారు. ఒక్క రూపాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయలేదన్నారు.
వైఎస్ హయాంలో 23 జిల్లాల్లో 20.41లక్షల మందిని మాత్రమే అర్హులుగా నిర్ణయించారని... వీరికి కూడ బడ్జెట్ పూర్తిగా ఇవ్వకుండా రూ.2,400 కోట్లు బకాయి పెట్టి వెళ్లిపోయారని పేర్కొన్నారు. తెలుగుదేశం హయాంలో అర్హులైన ప్రతి ఒక్క విద్యార్ధికి ఉపకార వేతనాలు సకాలంలో అందిస్తూ వారి చదువులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేలా అనేక చర్యలు తీసుకున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు.
బడి పిలుస్తోంది, బడికొస్తా వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. డ్రాప్ అమలుకు ప్రాథమిక పాఠశాలల్లో 6.27 శాతం నుంచి 0 శాతానికి తగ్గించామన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 5.7 శాతం నుంచి 0.43 శాతానికి తగ్గించామని... 10 వేల మంది ఉపాద్యాయులను అదనంగా నియమించాలన్నారు.
3వ తరగతిలో దేశంలోనే తొలి ర్యాంక్, 10వ తరగతిలో దేశంలోనే 2 వ ర్యాంక్‌తో ఏపీని అగ్రస్ధానంలో నిలబెట్టామని... జాతీయ సాఫల్యత సర్వే (ఎన్‌ఏయస్) పలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. 3,640 డిజిటల్ క్లాస్ రూంలు, 1217 వర్చువల్ క్లాస్ రూంలు అభివృద్ది చేశామని తెలిపారు.
ఐదు రోజులు గుడ్డు అందించటం ద్వారా మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచామన్నారు. 33,145 అదనపు తరగతి గదులు, 40,665 పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించామని అచ్చెన్నాయుడు వెల్లడించారు.
read more వైసిపి జగన్ సొంతం కాదు కబ్జా... పార్టీ అతడిదే..: టిడిపి ఎమ్మెల్సీ సంచలనం
రూ. 4,848 కోట్లతో ఉఫాధి హామీ పధకం ద్వారా 21,249 పాఠశాలలకు ప్రహారిగోడలు నిర్మించేందుకు కృషి చేశామన్నారు. పాఠశాలల మరుగుదొడ్ల నిర్వహణకు రూ.160 కోట్లు కేయించామని... 143 బాలికా వసతిగృహాలు ప్రత్యేకంగా నిర్మించామన్నారు. 9125 మంది విద్యార్దులకు ప్రతిభ పురస్కారాలు ఇచ్చి ప్రోత్సహించినట్లు వెల్లడించారు.
అందరికీ నాణ్యమైన విద్య అందించి ఆంధ్రప్రదేశ్‌ను విజ్ఞానాంధ్రప్రదేశ్‌గా టిడీపీ ప్రభుత్వం తీర్చిదిద్దిందని ప్రశంసించారు. విదేశీయులే నవ్యాంధ్రకు తరలివచ్చి విద్యను అభ్యసించేలా ప్రపంచస్థాయి విద్యాసంస్థలను నెలకొల్పామన్నారు. జిల్లా పరిషత్ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దామని.... 7500 పాఠశాలల్లో ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేశామన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2016-17లో ''స్కూల్ ఎడ్యూకేషన్ క్వాలిటీ ఇండెక్స్'' కింద పాఠశాల విద్యా ప్రమాణాలను పాటించడంలో దేశ వ్యాప్తంగా ఏపీ 4 స్థానంలో ఉందని నీతి ఆయోగ్ స్పష్టం చేసిందన్నారు. అలాంటింది ఇప్పుడేదో పాఠశాలల అభివృద్ది కొత్త చేపట్టినట్లు టిడీపీ నిర్లక్ష్యం చేసినట్లు వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నానని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.