గుంటూరు: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిపై ఘాటు విమర్శలు చేసిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై టిడిపి ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు విరుచుకుపడ్డారు. వరుస ట్వీట్లతో అటు మంత్రి అనిల్ ఇటు సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు.

''జగన్ గారు మూడో కన్ను తెరిస్తే జనాలు భస్మం అయిపోతారా? వైఎస్ చనిపోయినప్పుడు కొంపతీసి జగన్ గారు మూడో కన్ను తెరిచారా ఏంటి అనిల్ గారు? మంత్రి కంటే ముందు జగన్ భక్తుడుని అని ప్రకటించారు. అంతకంటే ముందు మీరు  క్రికెట్ బెట్టింగ్ కి వీర భక్తుడు అన్న విషయం కూడా ప్రకటించి ఉంటే బాగుండేది'' అంటూ సత్యనారాయణరాజు కర్నూల్ సభలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన కామెంట్స్ పై సెటైర్లు విసిరారు.  

read more  రాజధాని దిశగా... విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పై ఏపి సర్కార్ కీలక నిర్ణయం

''నోటి పారుదల శాఖ మంత్రి అనిల్ ముందు జగన్ గారికి సవాల్ విసరాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే వైఎస్ కాదు. యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ. శివ అనే వ్యక్తి పెట్టిన పార్టీని కబ్జా చేసి మమ్మల్ని ఎందుకు మోసం చేసావ్ జగనన్న... అని నిలదీయండి'' అని వైసిపి పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

''దమ్ముంటే ఆ పార్టీ నుండి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టి మమ్మల్ని గెలిపించు అని సవాల్ విసరండి. పూడుస్తాం, పాతేస్తాం అంటున్న అనిల్ ముందు పోలవరంలో ఒక తట్టెడు మట్టి తవ్వి చూపించాలి'' అంటూ మంత్రి వ్యాఖ్యలకు సత్యనారాయణరాజు సమాధానమిచ్చారు.