అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో స్థానికసంస్థల ఎన్నికల హడావుడి కొనసాగుతున్న సమయంలో వైసిపి ప్రభుత్వం రాజధాని అమరావతి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని పరిధిలోకి మరో 8 గ్రామాలను చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. 

సీఆర్డీఏ పరిధిలోకి తుళ్ళూరు మండలంలోని హరిశ్చంద్రపురం, వడ్డమాను, పెదపరిమి గ్రామాలు మంగళగిరి మండలంలోని ఆత్మకూరు, నవులూరు, బేతపూడి, యర్రబాలెం, చినకాకాని గ్రామాలను చేర్చింది.  వీటిని కలపడంతో  సీఆర్టీఏ పరిధి 37 గ్రామాలకు చేరింది. 8 గ్రామాలను రాజధాని పరిధిలోకి తీసుకువచ్చస్తున్నట్లు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

 read more  డబ్బు, మద్యంతోనే ఇన్నేళ్ల రాజకీయం: జేసీపై బొత్స వ్యాఖ్యలు

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవడమే కాదు నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 21న తొలి విడత, మార్చి 24న రెండో విడత పోలింగ్‌ నిర్వహించనున్నారు.

మార్చి 27న పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీల రెండింటికీ కలిపి మార్చి 29న కౌంటింగ్ నిర్వహించనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్ ఛైర్మన్‌ పదవులకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 

జిల్లాల వారీగా రిజర్వేషన్లు:

శ్రీకాకుళం- బీసీ (మహిళ)
విజయనగరం- జనరల్
విశాఖపట్నం- ఎస్టీ (మహిళ)
తూర్పుగోదావరి- ఎస్సీ (మహిళ)
పశ్చిమ గోదావరి- బీసీ
కృష్ణా- జనరల్ (మహిళ)
గుంటూరు- ఎస్సీ (మహిళ)
ప్రకాశం- జనరల్ (మహిళ)
నెల్లూరు- జనరల్ (మహిళ)
చిత్తూరు- జనరల్
కడప- జనరల్
అనంతపురం- బీసీ (మహిళ)
కర్నూలు- జనరల్