అహార భద్రతపై ఏపి ప్రభుత్వ సంచలన నిర్ణయం

నిరుపేదల ఆకలి బాధను తీర్చే ఆహార భద్రత విషయంలో ఏపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నియమ నిబంధనలతో కూడిన ఉత్తర్వులను విడుదలచేసింది.  

ap government changed food security rules and regulations

అమ‌రావ‌తి: ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆహార భ‌ద్రతా నియ‌మాల్లో స‌వ‌ర‌ణ‌లు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు లబ్దిదారులకు అందించే రేష‌న్ కార్డుల జారీకి గ‌తంలో ఉన్న అర్హ‌త‌ల్లో మార్పులు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన విధివిధాలను ప్రకటించారు. 

గ్రామాలు,ప‌ట్ట‌ణాల్లో వార్షికాదాయం,ఇత‌ర నిబంధ‌న‌ల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. గ్రామాల్లో అయితే వార్షికాదాయం ల‌క్షా ఇరవై వేలు,ప‌ట్ట‌ణాల్లో వార్షికాదాయం ల‌క్షా నలబైనాలుగు వేల‌ లోపు ఉన్న‌వారు రేషన కార్డు పొందడానికి అర్హులుగా నిర్ణయించింది. అలాగే నాలుగు చ‌క్రాల వాహ‌నాలు ఉన్న‌వారిని బీపీఎల్ కోటా నుంచి మిన‌హాయింపునిచ్చింది. 

ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ప‌నిచేసే పారిశుధ్య కార్మికుల‌ను బీపీఎల్ కోటా కింద ప‌రిగ‌ణించేలా ఉత్త‌ర్వులు జారీ చేసింది జగన్ ప్ర‌భుత్వం. ఇలా వివిధ నిబంధనల మార్పులతో కూడిన ఉత్తర్వులను జారీ  చేశారు. 

read more రౌడీ మంత్రులతో కలిసి జగన్ అసమర్ధ పాలన...రావణకాష్టంగా రాష్ట్రం: తులసి రెడ్డి

ఆహార భద్రత కార్యక్రమంలో భాగంగా ప్రజలు తినేందుకు వీలుగా ఉండే నాణ్యమైన బియ్యాన్ని అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.  రేషన్ కార్డుదారులకు నాణ్యమైన బియ్యాన్ని అందించేలా శ్రీకాకుళం జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే స్వర్ణ బియ్యానికి సమానమైన నాణ్యమైన బియ్యాన్ని రేషన్ కార్డులను అందించాలని ఏపీ సర్కార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 

ఖచ్చితమైన తూకంతో కూడిన  ప్యాకెట్ల రూపంలో గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా కార్డు దారులకు ఇంటికే బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లాలో శ్రీకారం చుట్టనున్నారు. ఒక్క శ్రీకాకుళం జిల్లాకు 15 వేల టన్ను బియ్యం అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు.  
 
రాష్ట్రంలో పౌరసరఫరాల సంస్థ ద్వారా కోటి 40 లక్షల మంది రేషన్ కార్డుదారులకు సుమారు 11వేల కోట్ల రూ.లు విలువైన బియ్యం కిలో రూపాయికే పంపిణీ చేస్తున్నట్టు పౌరసరపరా శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం రేషన్ కార్డుదారుల్లో 92లక్షల మంది కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుండగా మిగతా 55 లక్షల మంది కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందన్నారు.

read more  చంద్రబాబు కోసమే పవన్... హచ్ కుక్కను మించిపోయాడు...: మంత్రి అనిల్

వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో నాణ్యమైన బియ్యం అందించనున్నందున పాలిథిన్ బ్యాగుల స్థానంలో  పర్యావరణ హితమైన బ్యాగులతో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.ఈ మేరకు నెలకు 2 కోట్ల బ్యాగులు సరఫరా చేసేందుకు వీలుగా చర్యలు ఒక సంస్థకు ఆర్డర్ ఇవ్వనున్నట్టు తెలిపారు. గ్రామ,వార్డు వాలంటీర్ల ద్వారా బియ్యం ఇతర సరుకులు ఇంటింటా పంపిణీ చేపట్టినప్పటికీ ప్రస్తుతం ఉన్న రేషన్ డీలర్లు ఎవరినీ తీయబోమని మంత్రి నాని స్పష్టం చేశారు.

గ్రామ వాలంటీర్లు రేషన్ బియ్యాన్ని వారి పరిధిలోని 50ఇళ్ళలో ఇంటింటికీ వెళ్ళి కార్డుదారులకు అందించేందుకు వీలుగా వారికి రవాణా ఖర్చుల కింద నెలకు అదనంగా 500 రూలను ఇవ్వనున్నట్టు కమీషనర్ శశిధర్ తెలిపారు.అంతేగాక ఇంటింటీ బియ్యం పంపిణీ చేసి లబ్దిదారుల వేలిముద్రలు సేకరించి అథంటికేషన్ చేసేందుకు వీలుగా ప్రతి వాలంటీరుకు ఒక ఇపోస్ యంత్రంతోపాటు స్మార్ట్ ఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios