తాడేపల్లి: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో ఏర్పాటుచేసిన జిఎన్ రావు కమిటీ నివేదికపై విమర్శలు చేసేముందు ఒక్కసారి ఆ నివేదికను పూర్తిగా చదవాలని సూచించారు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. అంతేకాని నివేదికలో అసలు ఏముందో కూడా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు కమిటీపై, కమిటీ సభ్యులపై విమర్శలు చేయడం తగదన్నారు. 

గతంలో విశాఖపట్నం ను గొప్ప నగరం అంటూ చంద్రబాబు ప్రశంసించారని...దేశానికి రెండో రాజధాని అయ్యే అన్ని అర్హతులు వున్న నగరమని పేర్కొనలేదా అంటూ టిడిపి శ్రేణులను ప్రశ్నించారు. అలాంటి నగరంలోనే ఇప్పుడు తాము రాజధానిని ఏర్పాటు చేస్తామని అంటే ఎందుకు ఒప్పుకోవడం లేదని అడిగారు. దేశానికి రాజధానికిగా పనికొచ్చే నగరం రాష్ట్రానికి మాత్రం పనికిరాదా అని నిలదీశారు. 

విశాఖ సముద్రతీరాన వుందనే సాకు చూపిస్తున్నారని... పక్కనే వున్న మహారాష్ర్ట, తమిళనాడు రాష్ట్రాల రాజధానులు ముంబై, చెన్నైలు సముద్రతీరాన లేవా అని అడిగారు. వికేంద్రీకరణకు టిడిపి అనుకూలం కాదని స్ఫష్టంగా చెబుతోందని... ఇలాంటి పార్టీకి ప్రజలెవ్వరూ మద్దతివ్వడం లేదన్నారు.  

read more  ఆయనకు రాజకీయ భిక్షపెట్టినా తిన్నింటి వాసాలు లెక్కపెట్టారు: టిడిపి ఎమ్మెల్యే ఫైర్

జిఎన్ రావు కమిటి నివేదికపై టిడిపి దుష్ప్రచారం చేయడం ఇప్పటికైనా మానుకోవాలన్నారు. విశాఖ రాజధానికి అనువైన ప్రాంతం కాదని తప్పుడు ప్రచారం చేయడం మంచి పద్దతి కాదన్నారు. కేవలం అమరావతిలో మాత్రమే అభివృధ్ది జరగాలని చంద్రబాబు కోరుకుంటున్నారుని కానీ రాష్ర్టంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృధ్ది చెందాలని సిఎం జగన్ కోరుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. 

వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృధ్ది కోసమే వికేంద్రీకరణ చేపడుతున్నట్లు తెలిపారు. గతంలో శివరామకృష్ణ నివేదికను పక్కనపెట్టి నారాయణ కమిటీని వేసి ఏకపక్షంగా అమరావతిలో రాజధాని పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారని అన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన సమయంలో శ్రీకృష్ణ కమిటి నివేదికలో కూడా రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనకబాటుతనం గురించి చెప్పారన్నారు.

read more  సరిలేరు నీకెవ్వరు... సినిమా డైలాగులతో జగన్ పై బుద్దా వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు

జిఎన్ రావు, బోస్టన్ కమిటి నివేదికల ద్వారా హైపవర్ కమిటిలో చర్చించి వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొద్దని జిఎన్ రావు కమిటి చెప్పినట్లు పచ్చమీడియాలో విష ప్రచారం చేస్తోందన్నారు.