తాడేపల్లి: శాసనమండలిలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరును ప్రజలు గమనించారని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం సభలో రెండు బిల్లులు ప్రవేశ పెడితే పెద్దల సభ అయిత మండలి సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిపోయి ఏకంగా బిల్లును అడ్డుకుందని ఉపముఖ్యమంత్రి మండిపడ్డారు. 

అసలు బిల్లులు చర్చకు రాకుండా రూల్ 71 తీసుకువచ్చి కుట్ర చేశారని అన్నారు. 51 శాతం ఓట్లు 86 శాతం సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు గెలిపించుకున్నారని... ఇలా ఏర్పడిన ప్రజా ప్రభుత్వ నిర్ణయాన్ని టిడిపి నాయకులు అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు. 

శాసన మండలి ఛైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ సభలో అనైతికంగా వ్యవహరించారన్నారు. చైర్మన్ మండలి చైర్ ను గౌరవించలేదని... పక్కా టీడీపీ నాయకుడుగా వ్యవహరించారని మండిపడ్డారు. సభా నియమాలను అతిక్రమించారని అన్నారు. 

జయలలిత ఊటీకి వెళ్తే వైఎస్ జగన్ వక్రీకరించారు: చంద్రబాబు

అన్ని పార్టీలకు చెందిన సభ్యులు రూల్ ప్రకారం నిర్ణయం తీసుకోమన్నారని... కానీ ఛైర్మన్ మాత్రం అందుకు విభిన్నంగా వ్యవహరించారని ఆరోపించారు. కీలకమైన 
 బిల్లులను సెలెక్ట్ కమిటికి పంపి చైర్మన్ తప్పు మీద తప్పు చేశారని విమర్శించారు. చైర్మన్ తీరుపై అన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. 

సభ నిబంధనలకు విరుద్ధంగా టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ సభలో వీడియోలు తీశారని ఆరోపించారు. చంద్రబాబు కనుసన్నల్లోనే మండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారని...కాలయాపన చేయాడం కోసమే సెలెక్ట్ కమిటీకి పంపారన్నారు. సభలో టీడీపీ సభ్యులు గుండాలు, రౌడీలుగా వ్యవహరిస్తే చంద్రబాబు వారిని శబాష్ అని మెచ్చుకోవడం విడ్డూరంగా వుందన్నారు. 

చంద్రబాబుకు కుల రాజకీయాలు చేయడం వెన్నతో పెట్టిన విద్య అని డిప్యూటీ సీఎం విమర్శించారు. ఇప్పుడు కూడా మండలిలో జరిగిన పరిణామాలను అడ్డుపెట్టుకుని కులాల మద్య చిచ్చు పెట్టె ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 

read more  డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా ముస్లీం పుట్టుకే పుడితే...: టిడిపి మైనారిటీ నేతల ఘాటు విమర్శలు

శవ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు మించిన వారు దేశంలో మరొకరు లేరన్నారు. యావత్ రాష్ట్ర ప్రజానికం మూడు రాజధానుల  ప్రభుత్వ నిర్ణయాన్ని విషయాన్ని స్వాగతిస్తున్నారని అంజాద్ బాషా వెల్లడించారు.