జయలలిత ఊటీకి వెళ్తే వైఎస్ జగన్ వక్రీకరించారు: చంద్రబాబు
జయలలిత విశ్రాంతి కోసం ఊటీకి వెళ్తే వైఎస్ జగన్ దాన్ని వక్రీకరించారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైఎస్ జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని ఆయన అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు హీరోలయ్యారని వ్యాఖ్యానించారు.
అమరావతి: 1984 ఆగస్ట్ సంక్షోభం తనతో సహా అప్పటి టిడిపి ఎమ్మెల్యేలను హీరోలను చేసిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అప్పటి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అందరికీ స్ఫూర్తి. గ్రామగ్రామానా అప్పటి టిడిపి ఎమ్మెల్యేలను ఊరేగించారని ఆయన అన్నారు.విశ్రాంతికి జయలలిత ఊటికి వెళ్తే దానినీ వక్రీకరించారని చంద్రబాబు అన్నారు వైసిపి దీనికి ఇంతకింత మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. 13జిల్లాల ప్రజల దృష్టిలో జగన్ చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆయన అన్నారు.
విశ్రాంతికి జయలలిత ఊటికి వెళ్తే దానినీ వక్రీకరించారని చంద్రబాబు అన్నారు వైసిపి దీనికి ఇంతకింత మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. 13జిల్లాల ప్రజల దృష్టిలో జగన్ చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆయన అన్నారు. మెజారిటి ఉందని తలకు రోకలి చుట్టుకుంటారా అని నిలదీశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ చెప్పినవన్నీ అబద్దాలే అని ఆయన అన్నారు. రాజ్యాంగంలో కేపిటల్ పదమే లేదనడం ఒక అబద్దమని అన్నారు. జయలలిత పాలన ఊటి నుంచే అనడం మరో అబద్దమని అన్నారు. ఇంత అబద్దాల కోరును ఎక్కడా చూడలేదని అన్నారు.
Also Read: రాజ్యాంగంలో ఆ పదం లేదు, జయలలిత ఊటీ నుంచి పాలించారు: జగన్
శుక్రవారం చంద్రబాబు ఎమ్మల్యేలు, ఎమ్మెల్సీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తమను గుండెల్లో పెట్టుకుని ప్రజలు ఆదరించారని, ఇప్పుడు మళ్లీ టిడిపి ఎమ్మెల్సీలు హీరోలుగా నిలబడ్డారని ఆయన అన్నారు. కౌన్సిల్ లో ఇప్పటి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం మరో స్ఫూర్తి అని అన్నారు. రాష్ట్ర ప్రజల గుండెల్లో టిడిపి ఎమ్మెల్సీలు హీరోలు అయ్యారని, చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నారని చెప్పారు. ఊరూరా నీరాజనాలు అందజేస్తున్నారని చెప్పారు.
పార్టీని వీడిన ఇద్దరు ఎమ్మెల్సీలు చరిత్ర హీనులు అయ్యారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరిగేది ప్రజాస్వామ్యం కోసం పోరాటం..ఉన్మాదుల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటమని, ఇందులో వీరోచితంగా టిడిపి ఎమ్మెల్సీలు పోరాడారని ఆయన చెప్పారుప్రలోభాలను అధిగమించి టిడిపి ఎమ్మెల్సీలు హీరోలు అయ్యారని ఆయన అన్నారు.
Also Read: లేడీ పోలీస్ దుస్తులు మార్చకుంటుండగా ఫొటోలు: చంద్రబాబు వివరణ ఇదీ..
బెదిరింపులను ధీటుగా ఎదుర్కొని హీరోలు అయ్యారని,పాలాభిషేకాలు ప్రజల్లో పెరిగిన ప్రతిష్టకు నిదర్శమని ఆయన అన్నారు. టిడిపి చారిత్రాత్మక పోరాటంతో వైసిపి దిమ్మ తిరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. అక్కసుతోనే టిడిపి నేతల ఇళ్లపై దాడులకు తెగించారని అన్నారు. విచారణలో ఉండగా కార్యాలయాల తరలింపు తగదని, తరలిస్తే ఆ ఖర్చు అధికారుల నుంచేనని కోర్టు చెప్పిందని ఆయన చెప్పారు.
ఉన్మాదుల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటం ఇది. సెలెక్ట్ కమిటీకి పంపింది ప్రజాభిప్రాయం కోసమేనని, ప్రజాభిప్రాయం తీసుకుంటాం అనడం కౌన్సిల్ నేరమా అని ఆయన అన్నారు. కౌన్సిల్ రద్దు చేస్తామనడం మరో ఉన్మాద చర్య అని, రద్దు తీర్మానం చేయకుండా అసెంబ్లీలో చర్చ రాజ్యాంగ విరుద్దమని అన్నారు. దురుద్దేశాలతోనే కౌన్సిల్ రద్దుకు అసెంబ్లీలో సీఎం జగన్ చర్చ పెట్టారని, వైసిపి వీరంగాలకు హద్దు అదుపు లేకుండా పోయిందని ఆయన అన్నారు. సెలెక్ట్ కమిటి ముందు బిల్లు ఉన్నప్పుడు, అదే అంశం హైకోర్టుకు చెప్పినప్పుడు మళ్లీ అసెంబ్లీలో ఎలా చర్చిస్తారని ఆయన అడిగారు.
కౌన్సిల్ రద్దుకు భయపడేది లేదని, సీఎం జగన్ బెదిరింపులకు లొంగేది లేదని ఆయన స్పష్టం చేశారు. కౌన్సిల్ రద్దు చేస్తే చరిత్ర హీనులుగా మిగులుతారని, ఒక సభలో చర్చను ఇంకో సభలో ఎలా చర్చిస్తారని ఆయన అన్నారు ఒక సభాపతి నిర్ణయాన్నిఇంకో సభలో ఎలా ప్రశ్నిస్తారని ఆయన అడిగారు.
కౌన్సిల్ సభాపతిని అసెంబ్లీలో తప్పుపట్టడం ఎక్కడైనా జరిగిందా..? ఒక సభాపతి ప్రసంగాన్ని ఇంకో సభలో ఎలా డిస్ ప్లే చేస్తారని ఆయన ప్రశ్నించారు. కౌన్సిల్ సభాపతి ప్రసంగానికి అసెంబ్లీలో వక్ర భాష్యాలా..? రాజ్యాంగాన్ని, చట్టాలను తుంగలో తొక్కుతారా.. అని అడిగారు. మెజారిటి ఉందని తలకు రోకలి చుట్టుకుంటారా అని నిలదీశారు.