Asianet News TeluguAsianet News Telugu

బిసి వర్గీకరణ...ఏపి సీఎం జగన్ కీలక నిర్ణయం

ఆంధ్ర ప్రదేశ్ లో బిసిల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.  బిసిలను మూడు కేటగిరీలు  విభజించి మూడు కార్పోరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

AP CM YS Jagan To Take Key Decision on BC welfare
Author
Amaravathi, First Published Jan 11, 2020, 2:35 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని బిసి సామాజిక వర్గ అభివృద్ది కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనాభాను బట్టి బిసి సామాజిక వర్గాన్ని మూడు కేటగిరీలుగా విభజించి వారికి ప్రభుత్వం తరపున సహకారం అందించాలని సీఎం భావిస్తున్నారు. ఈ ఆలోచనను శనివారం బీసీ మంత్రులు, వైయస్సార్‌సీపీ బీసీ అధ్యయన కమిటీ సభ్యులు, బీసీ సామాజిక వర్గాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో సీఎం జగన్ వెల్లడించారు. 

10వేల నుంచి లక్ష జనాభా ఉన్న బీసీ వర్గాల వారిని ఒక కేటగిరీగా, లక్ష నుంచి 10లక్షల వరకూ ఉన్నటు వంటి బీసీ వర్గాల వారిని రెండో కేటగిరీ, 10లక్షలు ఆ పైబడి జనాభా ఉన్న బీసీ వర్గాల వారిని మూడో కేటగిరీగా విభజించాలని నిర్ణయించారు. ఆమేరకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం  తీసుకున్నారు. ఇలా వర్గీకరణ చేసి ఆయా వర్గాల అభ్యున్నతి కోసం ఈ కార్పొరేషన్ల ద్వారా విస్తృత చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. 

అసెంబ్లీ ఎన్నికలకు ముందు  జగన్‌ జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో బీసీ అధ్యయన కమిటీ వేశారు. అయితే ఈ కమిటీ తన అద్యయనాన్ని ముగించి నివేదిక కూడా సమర్పించింది. అందులోని అంశాలపై ఈ సమావేశంలో చర్చించిన సీఎం ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై  సభలో పాల్గొన్న బిజి  నాయకులతో సీఎం చర్చించారు. 

read more  అమరావతి పోరు: తిరుపతిలో చంద్రబాబు ర్యాలీకి అనుమతి నిరాకరణ

నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన సంచార వర్గాల వారి అభ్యున్నతికి కృషిచేయాలని సీఎం నిర్ణయించారు . వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు.  

పదివేల లోపు ఉన్న సంచారజాతులు, గుర్తింపునకు నోచుకోని వర్గాల వారికి సరైన గుర్తింపు నిచ్చి... వారు సమాజంలో నిలదొక్కుకునేలా ప్రభుత్వ పరంగా చేయూతనివ్వాల్సిన నిర్ణయించారు. ఈ వర్గాలకు గృహనిర్మాణం, పెన్షన్లు, రేషన్‌ కార్డులు, కులవృత్తులు చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక వెసులుబాట్లు కల్పించే దిశగా చర్చ జరిగింది.  ఆమేరకు ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగాలని నిర్ణయించారరు.

మరోసారి విస్తృత సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. అతి త్వరలో మరోసారి సమావేశం కానున్నట్లు... అందులో తానుకూడా పాల్గొంటానని సీఎం  వెల్లడించారు. మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, బీసీ సమాజిక వర్గాల ప్రతినిధులతో ఈ విస్తృత స్థాయి సమావేశంల పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

read more  పవన్ మీటింగ్ కి డుమ్మా... మంత్రి కొడాలి నానితో రాపాక సంబరాలు

తదుపరి జరిగే సమావేశంలో బీసీల అభ్యున్నతి కోసం ఇంకా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు స్వీకరించాలన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులు బొత్స సత్యన్నారాయణ,  మోపిదేవి వెంకటరమణ, అనిల్‌కుమార్‌ యాదవ్, ధర్మాన కృష్ణదాస్, శంకరనారాయణ, బీసీ వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios