Asianet News TeluguAsianet News Telugu

ఆ విభాగంలో భారీ ఉద్యోగాలు... ఉన్నతాధికారులకు సీఎం జగన్ ఆదేశం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమరవాణా, బెల్టుషాపులు, మద్యం అక్రమ తయారీ నిరోధంపై క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

AP CM YS Jagan Review Meeting with Excise Department Officers
Author
Amaravathi, First Published Mar 5, 2020, 5:20 PM IST

ఏపిలోని గ్రామాల స్వరూపాన్ని మార్చడానికి తమ ప్రభుత్వం అనేక  అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. గ్రామ సచివాలయం, వైయస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ల ఏర్పాటుతో పాటు ఇంగ్లిషు మీడియంలో విద్యాబోధన వంటి తదితర కార్యక్రమాల ద్వారా మార్పులు తీసుకొస్తున్నామని...గ్రామాల సమగ్రాభివృద్ధిలో ఇవన్నీ విప్లవాత్మకమైన  మార్పులు తీసుకు వస్తాయన్న నమ్మకం వుందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమరవాణా, బెల్టుషాపులు, మద్యం అక్రమ తయారీ నిరోధంపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌ మెంట్‌, ప్రొహిబిషన్‌–ఎక్సైజ్‌శాఖ అధికారులకు జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 

read more  ఆంధ్ర ప్రదేశ్ లో మరో భారీ స్టీల్ ప్లాంట్...సీఎంతో స్విస్ కంపనీ ప్రతినిధుల భేటీ

ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ విభాగంలో సిబ్బందిని పెంచాలంటూ ఉన్నతాధికారులకు సీఎం ఆదేశించారు. ప్రొహిబిషన్‌ – ఎక్సైజ్‌ శాఖలో ఉన్న మూడింట రెండు వంతుల సిబ్బందిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పనులకోసం వినియోగించాలని సీఎం సూచించారు. ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ విభాగంతో వీరంతా కలిసి కట్టుగా పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. 

రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో అద్భుతమైప కార్యక్రమాలు జరుగుతున్న ఈ సమయంలో బెల్టుషాపులు, అక్రమంగా మద్యం తయారీ, అక్రమ ఇసుక తవ్వకాలు లాంటివి ప్రభుత్వ ఉద్దేశాలను దెబ్బతీస్తాయని అన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామాల్లో బెల్టుషాపులు నడవకూడదని... అలాగే మద్యం అక్రమ తయారీ ఉండకూడదని సీఎం ఆదేశించారు. 

ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదని అధికారులకు సూచించారు. రాష్ట్ర సరిహద్దుల్లో అక్రమ ఇసుక రవాణా, మద్యం రవాణాలు ఉండకూడదని... ఇలాంటి ఘటనలపై పోలీసులు, ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ సిబ్బంది, ప్రొహిబిషన్‌ సిబ్బంది అత్యంత కఠినంగా వ్యవహరించాలని జగన్ ఆదేశించారు. గ్రామాల్లో ప్రభుత్వ ప్రతిష్ట పెరగాలంటే బెల్టుషాపులు ఉండకూడదని సీఎం అన్నారు. 

read more   ప్రజలను చంపే పిచ్చిమందు కోసం ప్రపంచబ్యాంక్ రుణమా?: .జగన్ సర్కార్‌పై బొండా ఉమ ఫైర్

ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో 11వేలకుపైగా మహిళా పోలీసులు ఉన్నారని.... వీరిని శక్తివంతంగా వాడుకోవాలని అధికారులకు సూచించారు. వారందరికీ ఇప్పటికే ఫోన్లు ఇచ్చామని...  ఎప్పటికప్పుడు వారినుండి సమాచారాన్ని తెప్పించుకోవాలన్నారు. బెల్టుషాపుల నిరోధమే మహిళా పోలీసుల ప్రాథమిక విధి అని అన్నారు. అలాగే ఈ విషయంలో మహిళా మిత్రలను కూడా సమర్థవంతంగా వాడుకోవాలని ముఖ్యమంత్రి జగన్ సూచించిరు.

స్టాండర్ట్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ను తయారుచేసుకోవడం ద్వారా విధుల నిర్వహణలో సమర్థతను పెంచుకుని అనుకున్న లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్నితో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios