అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేస్తూ.. ఈ విగ్రహం అంబేద్కర్‌దే కదా? అని అక్కడున్న వారిని ఎమ్మెల్యే ప్రశ్నించడంతో అంబేద్కర్ అభిమానులు ఖంగుతిన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవికి అంబేద్కర్‌ కూడా తెలియరా? అంటూ విమర్శలు గుప్పించారు.
 
ఇంకోవైపు రాజధానిలో జరుగుతున్న ఆందోళనలపై స్పందించేందుకు ఆమె నిరాకరించారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా .. కొవ్వొత్తుల ప్రదర్శనలో ఎమ్మెల్యే శ్రీదేవి పాల్గొన్నారు.  ఆంధ్రప్రదేశ్‌ను రక్షించండని ఉన్న పోస్టర్‌ను ఆమె ఈ సందర్భంగా పక్కకు నెట్టేశారు.

ఎమ్మెల్యే శ్రీదేవి తీరుపై స్థానికులు విమర్శలు చేస్తున్నారు. 


శ్రీదేవి కులంపై ప్రత్యర్థులు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆమెపై విచారణ చేశారు. గత ఏడాది చివర్లో సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావాలని శ్రీదేవిని జాయింట్ కలెక్టర్ కోరారు. జాయింట్ కలెక్టర్ విచారణకు కూడ ఆమె హాజరైంది. 

also read: 'వైసిపి ఎమ్మెల్యే శ్రీదేవి మిస్సింగ్'.. వెతికిపెట్టమంటున్న మహిళలు!

గత ఏడాది వినాయకచవితి సందర్భంగా వినాయకుడిని పూజ చేసే సమయంలో ఆమెను కొందరు కులం పేరుతో పూజలు చేయకుండా అడ్డుకొన్నారనే ఆరోపనలు వచ్చాయి.ఈ విషయమై స్థానికుల ఫిర్యాదు మేరకు కులం పేరుతో  ఆమెను ప్రశ్నించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

టీడీపీ నేతల తీరుపై ఆమె సూటిగా, ఘాటుగా విమర్శలు గుప్పిస్తుంటారు. ఈ తరుణంలోనే తాజాగా ఆమెపై చోటు చేసుకొన్న వివాదంపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి.