గుంటూరు: తాడేపల్లిలో ఓ ఆరేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. కన్న తండ్రే డబ్బుల కోసం బాలున్ని కిడ్నాప్ చేసినట్లు బాదిత బాలుడి తల్లే పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ ఘటన  గుంటూరు  జిల్లాలో సంచలనంగా మారింది. 

వివరాల్లోకి వెళితే... తాడేపల్లిలోని అమర్ రెడ్డి కాలనీలో ఓ జంట తమ ఆరేళ్ల కొడుకు పార్థసారథితో కలిసి నివసిస్తున్నారు. అయితే బుధవారం ఉదయం స్కూల్ కు వెళ్లిన బాలున్ని కన్న తండ్రే మరో ఇద్దరితో కలిసి కిడ్నాప్ చేశాడు. బాలుడి తండ్రి శ్రీనివాసరావుకు  మాయమాటలు చెప్పి శ్యామూల్, అబ్రహం అనే ఇద్దరు పిల్లాన్ని  కిడ్నాప్ చేసినట్లు బాలుడి తల్లి తెలిపింది. 

JusticeForDisha : చర్లపల్లి జైలులో దిశ కేసు నిందితులు

కిడ్నాప్ తర్వాత ఫోన్ చేసి తనకు రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు బాలుడి తల్లి ఆరోపించారు. డబ్బులిస్తేనే బాలున్ని అప్పగిస్తామని... లేదంటే ఎంతకయినా తెగిస్తామని బెదిరిస్తున్నారంటూ బాధిత మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు భర్తతో సహా అతడి  స్పేహితులిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదుతో అప్రమత్తమైన స్ధానిక పోలీసులు బాలుడి తండ్రిని అదుపుతో తీసుకున్నారు. పోలీసుల విచారణలో కిడ్నాప్ కు గురైన  బాలుడుతో నిందితులు గుంటూరు పరిసర ప్రాంతాలలో సంచరిస్తున్నట్లు సమాచారం తెలిసింది. దీంతో అలెర్ట్ అయిన పోలీసు అధికారులు నిందితుల కోసం పట్టణ పరిసర ప్రాంతాల్లో  విస్తృత తనిఖీలు చేపట్టారు.   

ఈ ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. తన భర్త తాగుడుకు బానిసై కన్నకొడుకునే కిడ్నాప్ చేసే, చేయించే స్థాయికి దిగజారాడని బాలుడి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. తన కొడుకును నిందితులకు బారినుండి సురక్షితంగా కాపాడాలని పోలీసులను వేడుకుంది. 

బాలుడి తల్లి ఆవేదన Video : డబ్బుల కోసం కన్నకొడుకునే కిడ్నాప్ చేసిన కిరాతకుడు