ఆ తర్వాత బాలయ్యతో సినిమా చేయకపోవడనికి కారణం అదే.. వివాదాలపై స్పందించిన విజయశాంతి

నిప్పురవ్వ చిత్రం తరువాత విజయశాంతి, బాలకృష్ణ కాంబినేషన్ లో మరో చిత్రం రాలేదు. వీరిద్దరూ కలిసి నటించలేదు. దానికి కారణం... ఆ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన అభిప్రాయబేధాలే అని ఓ రూమర్ అప్పట్లో చక్కర్లు కొట్టింది.

differences with balakrishna this is what vijayashanti said

లేడీ సూపర్ స్టార్ గా పేరుగాంచిన విజయశాంతితో బాలకృష్ణది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీళ్లద్దరూ కలిసి పదుల సంఖ్యలో సినిమాలు చేయగా.. అనేక సూపర్ హిట్స్ దక్కించుకున్నారు. 80-90లలో వీరి కాంబినేషన్ వెండితెరను షేక్ చేసింది రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవర్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి.బాలయ్య, విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం నిప్పు రవ్వ. 1993లో ఏ కోందండరామి రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన నిప్పురవ్వ భారీ అంచనాలు మధ్య విడుదలై, అనుకున్నంత విజయం సాధించలేదు. 


కాగా ఈ చిత్రం తరువాత విజయశాంతి, బాలకృష్ణ కాంబినేషన్ లో మరో చిత్రం రాలేదు. వీరిద్దరూ కలిసి నటించలేదు. దానికి కారణం... ఆ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన అభిప్రాయబేధాలే అని ఓ రూమర్ అప్పట్లో చక్కర్లు కొట్టింది. అయితే నిప్పురవ్వ సినిమా తరువాత Balakrishnaతో సినిమాలు చేయకపోవడానికి కారణం ఏమిటో విజయశాంతి... తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

Also read Unstoppable బాలయ్యతో టాక్ షో.. అల్లు అరవింద్ వ్యూహం ఇదేనా!


నిప్పురవ్వ సినిమా తర్వాత నా ఇమేజ్, రెమ్యూనరేషన్ బాగా పెరిగాయి. అలాగే వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో అవకాశాలు రావడం జరిగింది. దీనితో బాలయ్యతో మరలా జతకట్టే అవకాశం దక్కలేదు. అంతే కానీ ప్రచారమైనట్లు మా మధ్య ఎటువంటి విభేదాలు లేవని Vijayashanti క్లారిటీ ఇచ్చారు. 1997లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఒసేయ్ రాములమ్మ ఇండస్ట్రీ హిట్ అందుకుంది. అనేక టాలీవుడ్ రికార్డ్స్ చెరిపివేసింది ఈ చిత్రం. 

Also read రాయికి దెబ్బలు తగిలితేనే శిల్పం అవుతుందిః `అన్‌ స్టాపబుల్‌` షో కర్టెన్‌రైజర్‌లో బాలయ్య.. డాన్సు లతో హంగామా
2006లో విడుదలైన నాయుడమ్మ చిత్రం తర్వాత విజయశాంతి వెండితెరకు దూరం అయ్యారు. ఆమె పాలిటిక్స్ లో బిజీ కావడంతో సిల్వర్ స్క్రీన్ ని వదిలేశారు. దాదాపు 13ఏళ్ల గ్యాప్ తరువాత సరిలేరు నీకెవ్వరు మూవీతో ఆమె రీఎంట్రీ ఇచ్చారు.Mahesh babu హీరోగా  2020 సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం విజయశాంతి బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు. ఆమె తరచుగా కేసీఆర్ ప్రభుత్వంపై మాటల దాడి చేస్తూ ఉంటారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios