Asianet News TeluguAsianet News Telugu

#Sukumar:'కార్తికేయ 2' ...సుక్కుకు భలే పనిపెట్టిందే,'పుష్ప 2' తో పాటే...

కార్తికేయ 2 సక్సెస్  ఇంటర్వ్యూలలో నిఖిల్  ఎంతసేపూ రీసెంట్ హిట్టు గురించి మాట్లాడాడు తప్ప 18 పేజెస్ ప్రస్తావన వీలైనంత రాకుండా చూసుకున్నాడు. మరో ప్రక్క  బన్నీ వాస్ నిర్మాణంలో వస్తున్న చిత్రాలు తేడా కొడుతున్నాయి. 

Sukumar wants to rewrite 18 Pages scenes
Author
First Published Sep 15, 2022, 9:07 AM IST


బాహుబలి, కేజీఎఫ్ తర్వాత తెలుగు సినిమా నిర్మాతలు అంతా ఆలోచనలో పడ్డారు. ఆ తర్వాత పుష్ప..బాహబలి 2, కేజీఎఫ్ 2 లు వాళ్ల ఆలోచనలు నిజమే అని తేల్చాయి. దాంతో తెలుగు సినిమాలు ప్యాన్ ఇండియాకు భారీగా వర్కవుట్ అవుతాయని అర్దమైంది. ఆ తర్వాత వచ్చిన నిఖిల్ కార్తికేయ 2 ..చిన్న సినిమాలు కూడా ప్యాన్ ఇండియా కంటెంట్ ఉంటే వర్కవుట్ అవుతాయనే సిగ్నల్స్ ఇచ్చాయి. అంతేకాదు నిఖిల్ కు ఇప్పుడు హిందీలో కూడా మార్కెట్ ఏర్పడింది. ఈ క్రమంలో నిఖిల్ తర్వాత సినిమాలకు డిమాండ్ ఏర్పడింది. అంతేకాదు అవి ప్యాన్ ఇండియా స్దాయి రిలీజ్ కు సిద్దపడుతున్నాయి. ఈ క్రమంలో ఆ దర్శక,నిర్మాతలపై ప్రెజర్ పడుతోంది. సుకుమార్ కూడా ఆ లిస్ట్ లో ఉన్నారు.

అదెలా అంటే...సుకుమార్ రచనలో గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద కుమారి 21 ఎఫ్ ఫేమ్ సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. 18 పేజెస్ లోనూ అనుపమ పరమేశ్వరనే హీరోయిన్. అయితే ఇప్పుడు కొన్ని కీలక మార్పులు చేసుకుని కొంత భాగం రీ షూట్ చేస్తున్నారని వినికిడి. చాలా కాలం క్రితం పూర్తయిన ఫైనల్ కట్ ని సుకుమార్ చూసి మళ్ళీ మార్పులు చేయాలని చెప్పారట.  కొన్ని సీన్స్ రీషూట్ చేయాలని చెప్పారట. బ్యానర్ వాళ్లు కూడా ఉత్సాహంగా ఉన్నారు. దాంతో అవసరమైన మేరకు మళ్ళీ తీసేందుకు నిఖిల్ కూడా ముందుకు వచ్చారని సమాచారం.

 కార్తికేయ 2 సక్సెస్  ఇంటర్వ్యూలలో నిఖిల్  ఎంతసేపూ రీసెంట్ హిట్టు గురించి మాట్లాడాడు తప్ప 18 పేజెస్ ప్రస్తావన వీలైనంత రాకుండా చూసుకున్నాడు. మరో ప్రక్క  బన్నీ వాస్ నిర్మాణంలో వస్తున్న చిత్రాలు తేడా కొడుతున్నాయి. చావు కబురు చల్లగా, పక్కా కమర్షియల్ లాంటివి దెబ్బ కొట్టాయి. అందుకే 18 పేజెస్ విషయంలో జాగ్రత్త పడుతున్నారనే టాక్ సైతం వినిపిస్తోంది. 

18 పేజెస్ చిత్రాన్ని అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జిఏ2 పిక్చ‌ర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘పుష్ప’ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని అందించిన సుకుమార్ ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. మంచి క‌మ‌ర్షియ‌ల్ పాయింట్‌ని తీసుకుని మ్యూజిక‌ల్ యూత్ ఫిల్మ్‌గా ‘కుమారి 21ఎఫ్’తో ట్రెండ్ క్రియేట్ చేసిన ద‌ర్శ‌కుడు ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌కత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

సుకుమార్ కథతో గతంలో పల్నాటి సూర్య ప్రతాప్ 'కుమారి 21ఎఫ్' తీశారు. ఆ తర్వాత వాళ్లిద్దరూ చేస్తున్న చిత్రమిది. ఇందులో కథలు రాసే యువతి పాత్రలో అనుపమా పరమేశ్వరన్ కనిపించనున్నారు. ఆమెకు ప్రియుడిగా ఎప్పుడూ ఫోనులో ఉండే హుషారైన పాత్రలో నిఖిల్ నటిస్తున్నారు. కథలు రాసే పెన్నుకు, ఫోనుకు ప్రేమ ఎలా కుదిరిందనేది సినిమా కథ. ఇప్పటివరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తి కలిగించాయి. ఈ చిత్రానికి గోపిసుందర్ స్వరాలు సమకూరుస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios