Pushpa 2: 55 ఏళ్ల వ్యక్తిగా బన్నీ, జనం ఏక్సెప్ట్ చేస్తారా?
పుష్ప 2 బన్నీ 55 ఏళ్ల వ్యక్తిగా కనిపించ బోతున్నాడని తెలుస్తోంది. అలాగే అల్లు అర్జున్ పాత్రకు ఓ కొడుకు కూడా ఉంటాడట. బన్నీ కొడుకు పాత్రలో మరో యంగ్ హీరో కనిపిస్తాడని అంటున్నారు.
అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప' సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిన సంగతే. బన్నీ కెరీర్లో తొలి పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ మూవీ అనేక రికార్డులు చెరిపేస్తూ భారీ వసూళ్లు రాబట్టింది. చిత్రంలో అల్లు అర్జున్ నటన, సుకుమార్ టేకింగ్‌పై ప్రశంసల వర్షం కురిసింది. తెలుగుతో పాటు హిందీలోనూ ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు ముందే ప్రకటించిన సుక్కు.. తొలి భాగాన్ని 'పుష్ప ది రైజ్' పేరుతో ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ప్రస్తుతం రెండో భాగం ‘పుష్ప ది రూల్’ పేరుతో ఈ చిత్రాన్ని అతిత్వరలో సెట్స్ మీదకు తీసుకురాబోతున్నారు. మరోవైపు జనాల్లోనూ సెకండ్ పార్ట్‌పై ఓ రేంజ్ అంచనాలున్నాయి. ఈ నేపధ్యంలో పుష్ప 2 పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ మీడియా సర్కిల్స్ లో వినిపిస్తోంది. అదెంతవరకూ నిజమో తెలియాల్సి ఉంది.
అందుతున్న సమాచారం మేరకు...పుష్ప 2 బన్నీ 55 ఏళ్ల వ్యక్తిగా కనిపించ బోతున్నాడని తెలుస్తోంది. అలాగే అల్లు అర్జున్ పాత్రకు ఓ కొడుకు కూడా ఉంటాడని చెప్పుకుంటున్నారు. ఆ కొడుకు పాత్రలో మరో యంగ్ హీరో కనిపిస్తాడని అంటున్నారు. అయితే ఇది నిజమేనా...ఇలా చేస్తే బన్నిని జనం ఏక్సెప్ట్ చేస్తారా అనేది పెద్ద ప్రశ్న. అయితే ఈ లెక్కలన్నివేసుకునే సుకుమార్ ముందుకు వెళ్తారనేది నిజం.
మరో ప్రక్క 'పుష్ప 2' విడుదల తేదీ విషయానికి వస్తే..డిసెంబర్ 2023లో 'పుష్ప 2' విడుదలను ప్లాన్ చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు తాము అనుకున్నట్లుగా ప్రమోషన్‌లను ప్లాన్ చేయడానికి మరియు సినిమాను భారీ స్థాయిలో చేయడానికి వారి చేతుల్లో చాలా టైమ్ ఉంటుంది అంటున్నారు.
హిందీ మార్కెట్‌లో ‘కెజిఎఫ్ 2’ ఘనవిజయం తర్వాత, అల్లు అర్జున్ మరియు సుకుమార్ తమ సినిమాను అంతకు మించి రెడీ చేయాలని డిసైడ్ అయ్యారు. ‘కేజీఎఫ్’ తొలి భాగం హిందీలో ఓ మోస్తరు విజయం సాధించినా రెండో పార్టీకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దానికి తోడు ‘పుష్ప’ హిందీ మార్కెట్‌లో పెద్ద సక్సెస్ నమోదు చేసింది. దాంతో ‘కేజీఎఫ్ 2’ కంటే రెండో భాగానికి క్రేజ్ మరింత ఎక్కువగానే ఉంటుందని లెక్కేస్తున్నారు. మరో రెండు నెలల్లో షూటింగ్ ప్రారంభం కానుంది.
"ఆర్ ఆర్ ఆర్", "కే జి ఎఫ్ 2" వంటి సినిమాల సక్సెస్ చూసిన తర్వాత "పుష్ప 2" కూడా అదే రేంజ్ లో బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడం తో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం "పుష్ప: ది రూల్" ప్రీ రిలీజ్ బిజినెస్ 700 కోట్లు చేసినట్లు సమాచారం. అందులో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ మాత్రమే 300 కోట్లకు అమ్ముడయినట్లు తెలుస్తోంది.