Akhanda:‘అఖండ’కి బోయపాటికి షాకింగ్ రెమ్యునేషన్ !
అయితే వినయ విధేయరామ డిజాస్టర్ అవటంతో అతనితో సినిమా నిర్మాత కనపడలేదు. ఈ నేపధ్యంలో అఖండకు ఎంత రెమ్యనేషన్ ఇవ్వాలనే విషయమై పెద్ద డిస్కషన్ జరిగిందిట.
గత కొంతకాలంగా టాలీవుడ్ సినిమాల రేంజ్ పెరిగింది. ఒక్కో సినిమా వందల కోట్లు వసూళ్లు చేస్తున్నాయి. దీంతో మన హీరోలు, దర్శకులు రెమ్యునరేషన్ కూడా పెంచేశారు. టాలీవుడ్ టాప్ హీరోలు ఒక్కో సినిమాకు రూ.50 నుంచి 70 కోట్ల వరకూ తీసుకుంటున్నారు. అదే సమయంలో టాప్ డైరక్టర్స్ కూడా ఓ రేంజిలో రెమ్యునేషన్స్ తీసుకుంటున్నారు. స్టార్ డైరక్టర్స్ మినిమం రూ. 10 కోట్లు పుచ్చకుంటున్నారు. కానీ స్టార్ డైరక్టర్స్ లో ఒక్క త్రివిక్రమ్ తప్ప మిగతావారంతా కాస్త తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇక బోయపాటి శ్రీను . మాత్రం ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు పుచ్చుకుంటున్నారట. అయితే వినయ విధేయరామ డిజాస్టర్ అవటంతో అతనితో సినిమా నిర్మాత కనపడలేదు. ఈ నేపధ్యంలో అఖండకు ఎంత రెమ్యనేషన్ ఇవ్వాలనే విషయమై పెద్ద డిస్కషన్ జరిగిందిట.
ఓ ప్రక్కన క్రేజీ కాంబినేషన్...నందమూరి బాలకృష్ణ తో దర్శకుడు బోయపాటి సింహా లెజెండ్ సినిమాల తర్వాత చేసిన అఖండ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం. ఓ ప్రక్కన బడ్జెట్ కంట్రోలలో పెట్టాలనే తాపత్రయం.దాంతో అఖండ సినిమా కోసం దర్శకుడు బోయపాటి రెమ్యునరేషన్ తీసుకోలేదట. ఎందుకంటే సినిమాకు సంబంధించిన బడ్జెట్ విషయంలో నిర్మాతకు దర్శకుడికి చాలా సందర్భాల్లో చర్చలో గట్టిగానే జరిగాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు కోసం దర్శకుడు బోయపాటి శ్రీను ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. రూ.70 కోట్లతో ఈ సినిమా రూపొందుతుంది. బడ్జెట్ ఎక్కువవవ్వడం వలన నిర్మాతలు ముందే అనుకున్నంత బడ్జెట్ ఇవ్వలేమని డైరెక్ట్ గా చెప్పినట్లు రూమర్స్ కూడా వస్తున్నాయి. అందుకే బోయపాటి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. సినిమా విడుదల తర్వాత నాన్ థియేట్రికల్ బిజినెస్ అలాగే బాక్సాఫీస్ ప్రాఫిట్ బట్టి దర్శకుడికి షేర్స్ ఇస్తారని సమాచారం. అందుకే దర్శకుడు బోయపాటి పారితోషకాన్ని తర్వాత తీసుకుంటానని ముందుకు వెళ్లారట.
అలా చేసుకున్న ఎగ్రిమెంట్ ప్రకారం సినిమా సక్సెస్ అయిన తర్వాత లాభాల్లో వాటా తీసుకునేలా డీల్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం సినిమా హంగామా చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మొదటివారంలోనే 50 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం బోయపాటికి 10కోట్లకు పైగానే లాభం వచ్చే టట్లు కనిపిస్తోంది. ఎలాగైనా సినిమాను గ్రాండ్ గా తెరపైకి తీసుకురావాలని దర్శకుడు బోయపాటి చేసిన దానికి ఫలితం గట్టిగానే దక్కనుంది. మరి ఆ సినిమా మొత్తంగా ఏ స్థాయిలో లాభాలను అందిస్తుందో చూడాలి.