RRR: ట్రైలర్ రిలీజ్ తోనే కోట్ల రాబడి,షాక్ అవుతున్న సినీ పెద్దలు
‘‘భీమ్.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం రా’’ అంటూ రామ్‌చరణ్ చెప్పే డైలాగ్ ప్రేక్షకుల చేత విజల్స్ వేయించింది.అనుకున్నట్లుగానే ట్రైలర్ పెద్ద హిట్టైంది.
దాదాపు మూడు వందల కోట్ల రూపాయల పెట్టుబడి ఉన్నప్పుడు ఖచ్చితంగా రికవరీ కోసం రకరకాల మార్గాలు అన్వేషిస్తూంటారు నిర్మాతలు. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ విషయంలో అదే జరుగుతోంది. నిర్మాత డివివి దానయ్య, రాజమౌళి కలిసి ఆర్ ఆర్ ఆర్ కు సంభందించిన ప్రతి విషయాన్ని కమర్షియలైజ్ చేస్తున్నారని వినికిడి. ఈ మేరకు చాలా మందితో టై అప్ అవుతున్నారట. అంతెందుకు ఈ చిత్రం ట్రైలర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసి భారీ మొత్తాన్ని యాడ్స్ ద్వారా సంపాదించినట్లు చెప్పుకుంటున్నారు.
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు...యూట్యూబ్ లో ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసే ముందే ఓ స్టార్టప్ కంపెనీకు యాడ్ స్పేస్ ని అమ్మారని సమాచారం. సాధారణంగా యూట్యూబ్ లో వచ్చే యాడ్స్ ఏమీ ఈ చిత్రం ట్రైలర్ లో ఏ భాషలోనూ రావటం లేదు. ‘mfine’అనే యాప్ కు సంభందించిన యాడ్ వస్తోంది.ఇదొక విరుట్యువల్ మెడికల్ ఫెసిలిటీ స్టార్టప్ యాప్. వీళ్లు భారీ ఎత్తున మార్కెట్ లో ప్రవేశించటానికి గత రెండు సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ పెట్టుబడులు పెడుతున్నారు. ప్రమోషన్స్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఆర్ ఆర్ ఆర్ తో టై అప్ అయ్యారని వినికిడి. అయితే ఎంత మొత్తం ఇచ్చారనేది తెలియరాలేదు.
అనుకున్నట్లుగానే ట్రైలర్ పెద్ద హిట్టైంది. రాజమౌళి తన టేకింగ్ తో మరోసారి యావత్ దేశాన్ని అబ్బురపరిచాడు. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్స్‌లు, రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు, క్లాప్స్ కొట్టే డైలాగులతో ట్రైలర్ ఆద్యంతం అద్బుతం అనిపించింది. ‘‘భీమ్.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం రా’’ అంటూ రామ్‌చరణ్ చెప్పే డైలాగ్ ప్రేక్షకుల చేత విజల్స్ వేయించింది.ట్రైలర్ లో కథ గురించి కొంచెం క్లారిటీ ఇచ్చారు బ్రిటిష్ వారికి ఎదురు తిరిగిన కొమరం భీంని నిలువరించే సరైన పోలీస్ అధికారి కోసం వెతుకుతుంటారు. ఆ సమయంలో రాంచరణ్ సరైన వ్యక్తి అని అతడిని రంగంలోకి దింపుతారు.
Also read RRR:ఈ ప్రశ్న అడగ్గానే ...రాజమౌళికి విసుగు,ప్రస్టేషన్ వచ్చాయి
అప్పటి నుంచి భీం, రామ్ మధ్య వార్ మొదలవుతుంది. అయితే వారి మధ్యలో స్నేహం ఉండేలా చూపించడం స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఎలివేషన్లు వేరే లెవల్ లో వున్నాయి. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించే సినిమాగా ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. కీరవాణి నేపధ్య సంగీతం నెక్ట్స్ లెవిల్ లో వుంది. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా 2022 జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also read RRR: ట్రిపుల్ ఆర్ హీరోలకు రాజమౌళి టార్చర్.... తట్టుకోలేకపోయామన్న హీరోలు....