RRR : సల్మాన్ ఖాన్‌ను కలిసి రాజమౌళి,కారణం ఇదే?

ఈ నేపధ్యంలో అసలు వీరిద్దరూ ఎందుకు కలిశారు ? వీరి మీటింగ్ వెనక ఉన్న సీక్రెట్ ఏమిటి.. సల్మాన్ ను రాజమౌళి ప్రత్యేకంగా కలవడానికి అసలు కారణం ఏంటి ? అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి.

Reason Behind Rajamouli  Salman Khans Meeting

ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో మరియు మన తెలుగు మీడియాలో హాట్ టాపిక్ ఏమిటీ అంటే....సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో భేటీ అయ్యారు దర్శకధీరుడు రాజమౌళి అవ్వటం. ముంబైలో సల్మాన్‌ ఖాన్‌ను సినిమా సెట్స్‌లో కలిసిన రాజమౌళి గంటన్నరకు పైగా మాట్లాడుకున్నారు. అయితే వీరిద్దరూ కలవడం సినీవర్గాల్లో అనేక ఊహాగానాలకు తెరలేపింది. ఈ నేపధ్యంలో అసలు వీరిద్దరూ ఎందుకు కలిశారు ? వీరి మీటింగ్ వెనక ఉన్న సీక్రెట్ ఏమిటి.. సల్మాన్ ను రాజమౌళి ప్రత్యేకంగా కలవడానికి అసలు కారణం ఏంటి ? అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి.

అందుతున్న సమాచారం ప్రకారం రాజ‌మౌళి త‌న RRR మూవీ ట్రైల‌ర్‌ను ముంబైలో నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేసుకున్నార‌ు.  ఆ వేడుక‌కు స‌ల్మాన్‌ఖాన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించ‌డానిక‌నే వెళ్లి ప్ర‌త్యేకంగా క‌లిశార‌ని అంటున్నారు. సల్మాన్ ఖాన్ సీన్ లోకి వస్తే ఆ ప్రాజెక్టు వచ్చే క్రేజ్ వేరు. రామ్ చరణ్ కు సల్మాన్ ఖాన్ కు మంచి అనుబంధం ఉంది. గతంలో రామ్ చరణ్ సినిమా తుఫాన్ ని సైతం హిందీలో ఆయన ప్రమోట్ చేసారు. ఆ తర్వాత సల్మాన్ చిత్రానికి రామ్ చరణ్ డబ్బింగ్ కూడా చెప్పారు. ఈ క్రమంలో సల్మాన్ వెంటనే ఓకే చెప్తారు. అయితే పద్దతి ప్రకారం గౌరవంగా రాజమౌళి తాను వెళ్లి కలిసి ఇన్వైట్ చేస్తే బాగుంటుందని భావించి కలిసారు అని అంటున్నారు.

Also read ఊహించని చిత్ర విచిత్రం అంటూ RRR పోస్ట్.. అల్లూరి, కొమరం భీం కలసి 4 ఏళ్ళు పూర్తి

అయితే కొంద‌రు మాత్రం రాజమౌళి‌, స‌ల్మాన్ కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుందేమోన‌ని కూడా గుస‌గుస‌లాడుకుంటున్నారు. కానీ అలాంటిదేమీ ఉండే అవకాసం లేదు. ఎందుకంటే, RRR త‌ర్వాత రాజమౌళి త‌దుప‌రి చిత్రాన్ని సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌తో చేయ‌బోతున్నాన‌ని తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రి నెట్టింట వైర‌ల్ అవుతున్న ఈ వార్త‌ల‌పై రాజమౌళి అండ్ టీమ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.  ప్రస్తుతం రాజమౌళి తన తాజా చిత్రం “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. సినిమా జనవరి 7న భారీ ఎత్తున విడుదల కానుంది. నార్త్ లో ఈ సినిమా నిమిత్తం మూడు ఈవెంట్స్ ని ప్లాన్ చేసారు.

Also read అంచనాలు పెంచేస్తున్న RRR రచయిత.. అంత కాన్ఫిడెన్స్ కు కారణం..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios