Asianet News TeluguAsianet News Telugu

'టైగర్‌' కు థియేటర్స్ ఇవ్వటం లేదా,ఫ్యాన్స్ కు మండుతోంది

1970 -80 ద‌శ‌కంలో తెలుగు రాష్ట్రాల‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన స్టూవ‌ర్ట్‌పురానికి చెందిన గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు జీవితం ఆధారంగా ఫిక్ష‌న‌ల్ బ‌యోపిక్‌గా టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు మూవీ తెర‌కెక్కుతోంది.

Ravi Teja #TigerNageshwarRao is not Getting screens in Tamil Nadu jsp
Author
First Published Oct 12, 2023, 2:28 PM IST


మాస్ మహారాజా రవితేజ( Ravi Teja ) హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం  టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) దసరా పండుగ కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.రికార్డ్‌ స్థాయి వసూళ్లు నమోదు చేసే విధంగా ఈ సినిమా ఉంటుందని… పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా సత్తా చాటుతుందని ట్రేడ్ లో చెప్తున్నారు. తెలుగు రెండు రాష్ట్రాల్లో అంతా బాగుంది కానీ మిగతా చోట్ల థియేటర్స్ సమస్య వస్తున్నట్లుగా సమాచారం.
 
పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. 1970 -80 ద‌శ‌కంలో తెలుగు రాష్ట్రాల‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన స్టూవ‌ర్ట్‌పురానికి చెందిన గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు జీవితం ఆధారంగా ఫిక్ష‌న‌ల్ బ‌యోపిక్‌గా టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు మూవీ తెర‌కెక్కుతోంది.  హిందీ మినహా మిగిలిన భాషల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ కు పెద్దగా థియేటర్స్ కేటాయించటం లేదని మీడియాలో బలంగా వినిపిస్తోంది.   తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ సినిమాకు థియేటర్లు దొరకడం లేదని సమాచారం. ముఖ్యంగా మల్టిప్లెక్స్ లు తమిళనాట అసలు దొరకటం లేదంటున్నారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ విడుదల కావడానికి ఒక్కరోజు ముందు దళపతి విజయ్ ‘లియో’ సినిమా థియేటర్లలోకి వస్తోంది. తమిళనాడులో అన్ని థియేటర్లను ఈ సినిమా ఆక్యుపై చేసేసిందట. 

 ఇప్పటివరకు ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాకు ఓకే అయిన థియేటర్లు కేవలం 27 మాత్రమేనని సమాచారం.  మరో 10 నుంచి 15 థియేటర్లు మాత్రమే దొరుకుతాయని అంటున్నారు. కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి అని అంటున్నారు. తమిళం నుంచి తెలుగుకు వస్తున్న ‘లియో’ కు  మాత్రం ఆ సినిమాకు చాలా ఎక్కువ థియేటర్లలో విడుదలవుతున్నట్టు సమాచారం. ఈ సినిమాను తెలుగులో సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ విడుదల చేస్తోంది. 

  అక్టోబర్ 20న రవితేజ టైగర్ నాగేశ్వరరావు.. బాలకృష్ణ భగవంత్ కేసరి.. శివరాజ్ కుమార్ ఘోస్ట్ సినిమాలు వస్తున్నాయి. వీటిలో ఘోస్ట్ సినిమాకు పెద్దగా బజ్ లేదు. బట్ హిట్ టాక్ వస్తే నిలబడే ఛాన్స్ ఉంది. ఇక టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ పాజిటివ్ టాక్ తెచ్చుకొని హైప్ పెంచేసింది.  నుపుర్ స‌న‌న్‌, గాయ‌త్రి భ‌ర‌ద్వాజ్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ సినిమాలో రేణుదేశాయ్, అనుప‌మ్‌ఖేర్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా హిందీ వెర్ష‌న్ ప్ర‌మోష‌న్స్‌తో ర‌వితేజ బిజీగా ఉన్నాడు. టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 20న రిలీజ్ కానుంది.
 
 

Follow Us:
Download App:
  • android
  • ios