Asianet News TeluguAsianet News Telugu

‘జరగండి ’సాంగ్ దీపావళికి రావటం లేదా? ?ఈ వార్తలేంటి

భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ జరగండి పాటపై రామ్ చరణ్ అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది.  జరగండి పాటను  భారీ రేంజ్ లో చిత్రీకరించినట్లు మూవీ వర్గాలు వెల్లడించాయి. 

Ram Charan Jaragandi Wont Come Out for Diwali? jsp
Author
First Published Nov 10, 2023, 7:02 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్.. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో నిర్మాణ సంస్ద రీసెంట్ గా ఓ కీలకమైన అప్డేట్ ఇచ్చింది. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ జరగండి జరగండి అనే సాంగ్ దీపావళికి రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ మంగళవారం (నవంబర్ 7) సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.ఈ ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన పోస్టర్ కొన్ని రోజుల కిందట రిలీజైన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ జరగండి పాటపై రామ్ చరణ్ అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది.  జరగండి పాటను కూడా భారీ రేంజ్ లో చిత్రీకరించినట్లు మూవీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇప్పుడా పాట దీపావళి కి రావటం లేదండూ ఓ వర్గం మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం ఆ మీడియావారు చెప్తున్నది ఏమిటంటే...

రిలీజ్ డేట్ గురించి పూర్తి క్లారిటీలు, షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవటం,ఇంకా కొన్ని కీలకమైన సమస్యలు పరిష్కరించుకున్నాకే అఫీషియల్ ప్రమోషన్స్ మొదలెడితే బెస్ట్ అని టీమ్ భావిస్తోందిట. షూటింగ్ ఇంకా లేటయ్యి..రిలీజ్ డేట్ వాయిదా అవసరం అనుకుంటే ఇప్పటి నుంచే ప్రమోషన్స్ అనేది తెలివైన నిర్ణయం కాదు అని అనుకుంటున్నారట.  రిలీజ్ డేట్ దగ్గరలో ఉన్నప్పుడే ప్రమోషన్స్ కుమ్మేయడం మేలని లేకపోతే అప్పటికి ఈ ప్రమోషన్ మెటీరియల్ పాతబడి పోతుందని,అప్పుడు మళ్లీ మొదటి నుంచి ప్రమోషన్ చేయాల్సి వస్తుందని ,ప్రమోషన్ మెటీరియల్ వెతుక్కోవాల్సి వస్తుందని ఆలోచనలో పడ్డారని చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకూ నిజం అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికి ఇది పూర్తి నిరాధారం,ఊహాత్మమే అని చెప్పాలి.   
 
ఇక ఈ గేమ్ ఛేంజర్ మూవీ ఆడియో హక్కులను ప్రముఖ సంస్థ సారెగామ దక్కించుకున్నట్లు కూడా ఈ సందర్బంగా మేకర్స్ తెలిపారు.ఈ ఫస్ట్ సింగిల్ దీపావళికి వస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పారు. ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్ కూడా ఎంతో కలర్‌ఫుల్ గా కనిపిస్తోంది. ఇక ఈ గేమ్ ఛేంజర్ సాంగ్ లీకైన కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసిన మరుసటి రోజే మూవీ ఆడియో హక్కులు, ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్ రావడం విశేషం..గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సినిమాను భారీగా నిర్మిస్తున్నాడు… అలాగే ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి వుంది.. కానీ ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యమవుతోంది.  

కమర్షియల్ సినిమాలు చేయడంలో శంకర్ స్పెషలిస్టు అనే ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాగే సామాజిక సందేశానికి వినోదాన్ని జోడించి సిల్వర్‌ స్క్రీన్‌పై ప్రజెంట్‌ చేసే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది.  మరి గేమ్‌ ఛేంజర్ లో అలాంటి అంశాలు ఏమి ఉన్నాయో చూడాల్సిందే.  గేమ్‌ ఛేంజర్‌లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫీమేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. రాజోలు భామ అంజలి మరో కీలక పాత్ర పోషిస్తోంది. పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఎస్‌జే సూర్య, నవీన్‌ చంద్ర, శ్రీకాంత్‌, స‌ముద్రఖని, జ‌య‌రాయ్‌, సునీల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు తెర‌కెక్కిస్తున్నారు. గేమ్‌ ఛేంజర్‌కు పాపులర్ డైరెక్టర్‌ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి ఎస్‌ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios