యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్కో సినిమాకు మధ్య చాలా గ్యాప్‌ తీసుకుంటున్నాడు. బాహుబలి సినిమా కోసం ఏకంగా 5 ఏళ్ల పాటు పనిచేసిన ప్రభాస్ తరువాత సాహో సినిమా కోసం మరో రెండేళ్లే వెయిట్ చేయించాడు. సాహో సినిమా రిలీజ్‌ అయి ఆరు నెలలు దాటింది. సాహో సినిమా సెట్స్ మీద ఉండగానే రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించాడు ప్రభాస్. పీరియాడిక్‌ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ జ్యోతిష్కుడిగా నటిస్తున్నాడని తెలుస్తోంది.

అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. సాహో సెట్స్ మీద ఉండగానే ఈ మూవీని ప్రారంబించాడు. కానీ సాహో షూటింగ్ పూర్తయిన తరువాత ప్రభాస్‌ లాంగ్ గ్యాప్ తీసుకొని విదేశాలకు వెళ్లిపోవటంతో షూటింగ్ వాయిదా పడింది. షూటింగ్ ప్రారంభమైన తరువాత కూడా వేగంగా షూటింగ్ చేయలేదు. దీంతో సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. కరోనా ఎఫెక్ట్ స్టార్ట్ అయిన తరువాత కూడా జార్జీయాలో షూటింగ్ చేశాడు.

కానీ కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ అర్థాంతరంగా ఆగిపోయింది. ప్రభాస్ ఇంటికి తిరిగి వచ్చేసి హైదరాబాద్‌లో హోం క్వారెంటైన్‌లో ఉంటున్నాడు. దీంతో షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాదేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా ఈ సినిమాను 2021 జనవరిలో రిలీజ్‌ చేయాలని భావించారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనవరిలో సినిమా రిలీజ్ చేయటం కుదిరేలా లేదు. దీంతో సినిమాను సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట చిత్రయూనిట్. మరింత ఆలస్యం కాకుండా ఎట్టి పరిస్థితుల్లో సినిమాను సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి ఫిక్స్‌ అయ్యారట. 

ప్రభాస్‌ జరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌తో కలిసి ప్రభాస్ పెదనాన కృష్ణం రాజు గోపీ కృష్ణా మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నాడు.