#Nithiin: ఇదేం ట్విస్ట్? నిఖిల్ అనుకుని నితిన్ ని పిలిచారా?
నితిన్ ని అయోమయంలో పేడసింది. అసలే మాచర్ల నియోజక వర్గం సమయంలో డైరక్టర్ పాత ట్వీట్స్ తో ఓ వర్గం దూరమయ్యారు. దాంతో తన సినిమాలకు దెబ్బ పడుతుందని అర్దమైంది.
రీసెంట్ గా యంగ్ హీరో నితిన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారన్న వార్త బయటకు వచ్చాక, అసలు నితిన్ ఎందుకు రాజకీయంగా ముందుకు వెళ్తున్నాడు, సినిమాలు చేసుకోకుండా? అన్న చర్చ సర్వత్రా షురూ అయ్యింది.బీజేపి తప్పేముంది.? రాజకీయ పార్టీలకు కొన్ని వ్యూహాలుంటాయి.. వాటి ప్రకారమే తమ పాపులారిటీ పెంచుకోవడానికి రాజకీయ పార్టీలు సినీ గ్లామరుని వాడుకుంటుంటాయి.
ఈ భేటీతో బీజేపీకి నితిన్ సపోర్ట్ ఇస్తాడా.? లేదా.? అన్న చర్చ మొదలైంది. ఇది ఓ సామాజిక వర్గాన్ని ఆనంద పరిచింది. కానీ నితిన్ ని అయోమయంలో పేడసింది. అసలే మాచర్ల నియోజక వర్గం సమయంలో డైరక్టర్ పాత ట్వీట్స్ తో ఓ వర్గం దూరమయ్యారు. దాంతో తన సినిమాలకు దెబ్బ పడుతుందని అర్దమైంది. దాంతో ఏ పార్టీతోనూ నితిన్ సంభందం పెట్టుకోవటానికి ఇష్టపడటం లేదు. అయితే నితిన్ ఆలోచనలకు తగినట్లుగా ఓ వార్త ఇప్పుడు మీడియాలో మొదలైంది. అదేమిటంటే...
వాస్తవానికి బీజేపీ పార్టీ కలుద్దామనుకుంది నిఖిల్ ట. కానీ పేర్లు పొరపడి నితిన్ సీన్ లోకి వచ్చాడట. నిఖిల్ రీసెంట్ గా కార్తికేయ 2 తో సూపర్ హిట్ కొట్టడం వార్తల్లో నిలిచింది. ఈ నేపధ్యంలో నిఖిల్ తో బిజేపీ భేటీ అవ్వావని ప్లాన్ చేసి పై నుంచి ఆ పేరు పంపారట. అయితే చిన్న పొరపాటుతో నిఖిల్ కాస్తా నితిన్ అయ్యిందని చెప్పుకుంటున్నారు.
మరో ప్రక్క నిఖిల్ (Nikhil Siddharth) హీరోగా నటించిన లేటెస్ట్ కార్తికేయ-2 (Karthikeya-2) టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. ఎన్నో కష్టాలు.. అనేక వాయిదాల తరువాత ఆగస్టు 13న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీసు వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. 2014లో విడుదలైన కార్తికేయ మూవీకి ఇది సీక్వెల్. డైరెక్టర్ చందు మొండేటి (Chandoo Mondeti)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్‌గా నటించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.