Acharya:'ఆచార్య' ఫైనల్ సెటిల్మెంట్... ఎన్ని కోట్లో తెలిస్తే షాకే
కొణిదెల, మ్యాట్నీ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్లు జస్ట్ పేరు మాత్రమే వేసుకోగా.. లాభనష్టాలు అన్నీ ముందు నుంచే కొరటాల చూసుకున్నారు. దాంతో ఇప్పుడు ఫైనల్ సెటిల్మెంట్ కూడా చేసేసారని వినికిడి. ఈ మేరకు భారీ గా ఎమౌంట్స్ పే చేసారని వినికిడి.
భారీ అంచనాల మధ్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. చిరంజీవి , రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా అయినప్పటికీ ఈ సినిమా మెగా అభిమానులను మెప్పించడంలో పూర్తి స్దాయిలో విఫలమైంది. ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లు భారీగానే నష్టపోయారు. కొరటాల శివ ఈ సినిమా కోసం అన్ని తానై నడిపించారు. సినిమా బిజినెస్ విషయంలో కూడా కీలక పాత్ర పోషించారు. కొణిదెల, మ్యాట్నీ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్లు జస్ట్ పేరు మాత్రమే వేసుకోగా.. లాభనష్టాలు అన్నీ ముందు నుంచే కొరటాల చూసుకున్నారు. దాంతో ఇప్పుడు ఫైనల్ సెటిల్మెంట్ కూడా చేసేసారని వినికిడి. ఈ మేరకు భారీ గా ఎమౌంట్స్ పే చేసారని వినికిడి.
అందుతున్న సమాచారం మేరకు డిస్ట్రిబ్యూటర్స్ కు 33 కోట్లు పే చేయాలని లెక్క తేల్చినట్లు సమాచారచం. కొరటాల శివ, ఆయన టీమ్ కలసి చాలా భాగం ఈ సెటిల్మెంట్ చేసారని తెలుస్తోంది. అయితే పెండింగ్ ఇంకా ఉందని తెలుస్తోంది. ఫారిన్ వెకేషన్ పూర్తి చేసుకుని వచ్చిన చిరంజీవి ...కొరటాలని కలిసి ...ఈ సెటిల్మెంట్ విషయాలు మొత్తం తెలుసుకున్నట్లు సమాచారం. ఎన్నాఏల పద్ధతిలో ఆచార్యను రిలీజ్ చేయడంతో బయ్యర్లకు వచ్చిన నష్టంలో వెనక్కు ఇవ్వాలి. ఇక నైజాంలో ఈ సినిమా కొన్న వరంగల్ శ్రీనుకు 20 కోట్ల పైనే నష్టం వచ్చింది. దీంతో ఆయనకు కొరటాల భారీగా వెనక్కు కట్టడంతో పాటు ఇతర హామీలు కూడా ఇచ్చేలా ఒప్పందాలు జరుగుతున్నాయంటున్నారు
ఈ చిత్రం ఓటిటి రైట్స్ తీసుకున్న అమేజాన్ ప్రైమ్ వారు ఇంకా కొంత క్లియర్ చేయాల్సి ఉంది. ఈ నెలాఖరకు వారు క్లియర్ చేయబోతున్నట్లు సమాచారం. మరో ప్రక్క చిరంజీవి తన రెమ్యునరేషన్ లో పది కోట్లు వెనక్కి ఇచ్చారని తెలుస్తోంది. అలాగే నిర్మాత నిరంజన్ రెడ్డి...జీఎస్టీ ఎక్సపెన్సెస్ లను భరించటానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. త్వరలోనే పూర్తి క్లియర్ చేసి బయిటపడనున్నారు.