Chiranjeevi: ‘ఆచార్య’రిజల్ట్ మెహర్ రమేష్ కు చుట్టుకుందే!?
కొరటాల శివ లాంటి గొప్ప డైరక్టర్ సైతం చిరంజీవిని గెలిపించలేకపోయారు. ఇప్పుడు మెహర్ రమేష్ తో కనీసం మినిమం సినిమా అయినా వస్తుందా అంటున్నారు.
‘ఆచార్య’ సినిమా రిజల్ట్ కన్ఫర్మ్ అయ్యిపోయింది. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా కాబట్టి వీకెండ్ వరకు వసూళ్లు బాగానే ఉంటాయనుకున్నారు కానీ అది కనపడటం లేదు. రేపటి నుంచి సినిమా నిలబడుతుంది అనేది డౌటే. కంటెంట్ పరంగా అయితే ఈ చిత్రం సగటు ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేయటమే కాకుండా మెగా అభిమానులు సైతం అసంతృప్తితోనే ఉండే పరిస్దితి వచ్చేసింది. సినిమా చూసిన నిరాశ చెందిన వాళ్లంతా దర్శకుడు కొరటాల ని ఆడిపోసుకుంటున్నారు.
కొరటాల పేరు ట్విట్టర్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. కొరటాల ఎన్నడూ లేని విధంగా, తొలిసారిగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఒక దర్శకుడి మీద ఈ స్థాయిలో దాడి జరగడం కొత్తే. ఒక సినిమా ఫలితానికి ప్రధాన బాధ్యత దర్శకుడిదే అనడంలో సందేహం లేదు. అదే సమయంలో పూర్తిగా దర్శకుడినే బాధ్యుడిని చేయడం కూడా కరెక్ట్ కాదా అన్నది ప్రక్కన పెడితే ఇదే ఊపులో జనం దృష్టి చిరంజీవి నెక్ట్స్ ప్రాజెక్టు భోళా శంకర్ పై పడింది.
మెగాస్టార్ చిరంజీవికి ఇలాంటి ఫ్లాఫ్ లు కొత్తేమీ కాదు మరియు త్వరలో ఆయన తన మరో చిత్రానికి వెళ్లాడు, అది నెక్ట్స్ లెవిల్ లో ఉంది. అదే మెహర్ రమేష్‌తో చేస్తున్న భోలా శంకర్. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కొరటాల శివ లాంటి గొప్ప డైరక్టర్ సైతం చిరంజీవిని గెలిపించలేకపోయారు. ఇప్పుడు మెహర్ రమేష్ తో కనీసం మినిమం సినిమా అయినా వస్తుందా అంటున్నారు. మరికొందరు అయితే మరో అడుగు ముందుకు వేసి మెహర్ రమేష్ సినిమా ..మెగా అభిమానులకు బ్లాక్ బస్టర్ అందిస్తుందని అభిమానులు సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
సరదా కోసమే ఈ ట్రోలింగ్ జరుగుతున్నా అభిమానులుకు మాత్రం మండుతోంది. సినిమా రిలీజ్ వరకు ఏ సినిమా వర్కవుట్ అవుతుందో మనకు తెలియదు. మెహర్ రమేష్ ప్రాజెక్ట్ సాధారణంగా చిరు లైనప్‌లో బలహీనమైన చిత్రంగా కనిపించటమే అందుకు కారణం. ఆయన ట్రాక్ రికార్డ్ అంత దారుణంగా ఉండటం అందుకు ప్రధాన కారణం, అయితే రీమేక్ కాబట్టి కొంతలో కొంత సేఫ్ అనుకోవాలి అంటున్నారు.
అయినా చిరంజీవి ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటారు. ఆయనపై రకరకాల విషయాలు ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. స్క్రిప్టును కూడా ఒక పట్టాన ఓకే చేయరని, ఆయన ఆమోద ముద్ర వేస్తే మినిమం గ్యారెంటీ అవుతుందనే అభిప్రాయం కూడా జనాల్లో ఉంది. ఇక షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాల్లో చిరు జోక్యం ఉంటుందని కూడా చెబుతారు. ఏదైమైనా ఇప్పుడే మెహరా రమేష్ ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదన్నది అందరూ గుర్తించాల్సిన విషయం.