Kiran Abbavaram:'సెబాస్టియన్' డిజాస్టర్ షాక్..నెక్ట్స్ ట్రాజడీ ఎండింగ్ తో లాక్!
ఈ యంగ్ హీరో నుంచి వస్తోన్న కొత్త సినిమా ‘సమ్మతమే’గురించి ఓ టాక్ బయిటకు వచ్చింది. అర్బన్ బ్యాక్ డ్రాప్‌లో సాగే మ‍్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ . కాగా ఈ సినిమా కథ గురించి తాజాగా ఒక షాకింగ్ వార్త వినిపిస్తోంది.
కిరణ్ అబ్బవరం మొదటి సినిమా రాజా వారు రాణి గారు, రెండవ సినిమా ఎస్.ఆర్ కళ్యాణమండపం రెండు సినిమాలు మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి.థర్డ్ మూవీతో హ్యాట్రిక్ కొడతాడని అనుకున్న కిరణ్ కెరియర్ లో ఫస్ట్ టైం డిజాస్టర్ అందుకున్నాడు. సెబాస్టియన్ టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి కలిగించినా సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది.
యువ హీరో కిరణ్ అబ్బవరం కి తన లేటెస్ట్ సినిమా సెబాస్టియన్ పీసీ 524 ద్వారా పెద్ద షాక్ తగిలిన సంగతి తెలసిందే. బాలాజి సయ్యపురెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కిరణ్ సరసన కోమలీ ప్రసాద్, నువేక్ష హీరోయిన్స్ గా నటించారు. రేచీకటి కాన్సెప్ట్ తో వచ్చిన సెబాస్టియన్ ఫస్ట్ హాఫ్ వరకు పర్వాలేదు అనిపించగా సెకండ్ హాఫ్ సినిమా పూర్తిగా ట్రాక్ తప్పడంతో ఆడియెన్స్ డిజప్పాయింట్ అయ్యారు. శుక్రవారం రిలీజైన ఈ సినిమా చాలా చోట్ల జనాలు లేరని షోలు ఆపేసారు. దాంతో ఈ చిత్రంతో కిరణ్ అబ్బవరం కి ఈ డిజాస్టర్ షాక్ గట్టిగానే తగిలేలా ఉంది. సినిమా వసూళ్లు కూడా దారుణంగా ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఈ యంగ్ హీరో నుంచి వస్తోన్న కొత్త సినిమా ‘సమ్మతమే’గురించి ఓ టాక్ బయిటకు వచ్చింది. అర్బన్ బ్యాక్ డ్రాప్‌లో సాగే మ‍్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ . కాగా ఈ సినిమా కథ గురించి తాజాగా ఒక షాకింగ్ వార్త వినిపిస్తోంది. ఈ సినిమా ట్రాజడీ ఎండింగ్ అని, హీరో చనిపోవటం తో ఈ సినిమా ముగుస్తుందని.. సినిమా వెరీ ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ సినిమా పై అంచనాలను పెంచేశాయనుకునేలోగా ఈ వార్త వచ్చింది.
ఇక ఈ సినిమా టీమ్ చేసిన మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా జనంలోకి బాగా వెళ్లాయి. శేఖర్ చంద్ర ట్యూన్, కృష్ణకాంత్ సాహిత్యం ఈ సినిమాకి బాగా ప్లస్ కానున్నాయంటున్నారు. ఇక ఈ సినిమాలో కిరణ్, చాందినీ చౌదరీల మధ్య సాగే రొమాంటిక్ ట్రాక్ అదిరిపోతుందంటున్నారు. అయితే ఎన్ని ఉన్నా ట్రాజడీ ఎండింగ్ ప్రేక్షకులు ఎంతవరకూ రిసీవ్ చేసుకుంటారంటున్నారు. యూజీ ప్రొడక్షన్ బ్యానర్‌పై కె. ప్రవీణ్ నిర్మించిన ఈ సినిమాకు గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఏది ఏమైనా అప్ కమింగ్ హీరోకి ఇలాంటి మరో షాక్ తగలితే మాత్రం కెరియర్ మీద భారీ ఎఫెక్ట్ పడుతుందని చెప్పొచ్చు.