Bheemla Nayak:బ్రేక్ ఈవెన్ అవుతుందా? భారీ డ్రాప్ కు బలవుతుందా

దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వ‌లేదు. దాంతో అందరి దృష్టీ శని,ఆదివారం కలెక్షన్స్ పైనే ఉంది. శుక్రవారం రిలీజైన ఆడవాళ్ళూ మీకు జోహార్లు సినిమా ప్లాఫ్ టాక్ రావటం కొంతలో కొంత కలిసి వచ్చిందంటున్నారు.

Is pawn Kalyan Bheemla Nayak Reach Breakeven?

పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’.  ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొన్న శుక్రవారం రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది.  త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించిన ఈ చిత్రం మొదట్లో ఉన్నంత ఊపు తర్వాత కనపడటం లేదు.  మొదటి మూడు రోజులు అదిరిపోయే కలెక్షన్స్ సొంతం చేసుకున్న ‘భీమ్లా నాయక్’ నాలుగో రోజు కాస్తా డల్ అయ్యింది. అయితే  ఐదో రోజు శివరాత్రి సందర్భంగా వసూళ్లు అదిరిపోయాయి. మళ్ళీ ఆరో రోజు  ఈ సినిమా కలెక్షన్స్‌లో భారీ డ్రాప్ కనిపించింది. ఏడో  రోజు వసూళ్లు కూడా అంతంత మాత్రమే.   చాలా చోట్ల‌... థియేట‌ర్లు ఖాళీగా క‌నిపించాయి.
 
ఫస్ట్ వీక్ లో దాదాపుగా రూ.88 కోట్ల షేర్ సాధించింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వ‌లేదు. దాంతో అందరి దృష్టీ శని,ఆదివారం కలెక్షన్స్ పైనే ఉంది. శుక్రవారం రిలీజైన ఆడవాళ్ళూ మీకు జోహార్లు సినిమా ప్లాఫ్ టాక్ రావటం కొంతలో కొంత కలిసి వచ్చిందంటున్నారు.

ఇక ట్రేడ్ లెక్కల ప్రకారం ...నైజాంలో ఈ సినిమాని రూ.30 కోట్ల‌కు కొన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ రూ.29 కోట్లు వ‌చ్చాయి. మ‌రో కోటి రూపాయ‌లు రాబ‌ట్ట‌డం అంత క‌ష్ట‌మేం కాదంటున్నారు.  దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ  మార్జిన్లు చాలా తక్కువ ఉన్నాయి. ఈ శ‌ని, ఆది వారాలు భీమ్లాకి చాలా కీల‌కం. బాక్సాఫీసు ద‌గ్గ‌ర మ‌రో సినిమా పోటీ ఏం లేదు. సో.. భీమ్లా ఈ వీకెండ్ కూడా  మంచి కలెక్షన్స్  అందుకోవ‌చ్చు.

వ‌చ్చేవారం.. `రాధేశ్యామ్‌` వ‌చ్చేలోగా....బ్రేక్ ఈవెన్ అయ్యిపోయి... భీమ్లా ప్రక్కకు వెళ్లిపోవాలి. లేకపోతే థియోటర్స్ కష్టం. రెండు తెలుగు రాష్ట్రాల్లో మ‌రో రూ.10 కోట్లు సంపాదిస్తే.. భీమ్లా బ్రేక్ ఈవెన్ అయిపోవొచ్చు.

ఒరిజనల్ తో పోల్చితే ఈ సినిమాలో పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేసి తెరకెక్కించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ను ఎదురు నిలిచి ఢీ కొట్టే పాత్రలో డేనియర్ శేఖర్ పాత్రలో రానా దగ్గుబాటి కనపడ్డారు. ఈ సినిమా మలయాళంలో పృథ్వీ రాజ్ సుకుమారన్, బిజూ మీనన్ చేసిన పాత్రలను తెలుగులో పవన్ కళ్యాన్, రానా చేసారు.మలయాలంలో పోలీస్ ఆఫీసర్ పాత్ర కంటే రిటైర్డ్ మిలటరీ హవాల్దార్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కానీ తెలుగుకు వచ్చేసరికి రానా పాత్రకు ప్రాధాన్యం తగ్గించి , పవన్ కళ్యాణ్  చేసిన పాత్రకు ప్రాధాన్యత పెంచటం...అతని వైపు నుంచి కథ చెప్పటమే కలిసొచ్చింది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios