#DilRaju: దిల్ రాజుని కన్ఫూజన్ లో పడేసిన ఆ అమ్మాయి, దేవరకొండ?
లక్కీ ప్రొడ్యూసర్ గా పేరును సంపాదించుకున్న దిల్ రాజుకు నిర్మాతగా షాకులు తప్పడం లేదు.థాంక్యూ సినిమాతో కూడా దిల్ రాజుకు పూర్తిగా నష్టపోయారు. ఈ నేపధ్యంలో ఆయన తీసుకునే ప్రతీ నిర్ణయం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.
అప్పట్లో దిల్ రాజు...విజయ్ దేవరకొండకు అడ్వాన్స్ ఇవ్వటం జరిగింది. అటు ఇంద్రగంటి మోహన్ కృష్ణతోనూ దిల్ రాజు సినిమా చేస్తానని అన్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో కథ ఒకటి రెడీ చేసారు. స్క్రిప్టు పూర్తైంది. అయితే ఇప్పుడు పరిస్దితి లు పూర్తిగా మారిపోయాయి. లైగర్ తో విజయ్ దేవరకొండ డిజాస్టర్ లో ఉన్నారు. మరో ప్రక్క ఇంద్రకంటి మోహనకృష్ణ కూడా రెండేళ్ల విరమణ తర్వాత "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" అనే సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ టాక్ ను అందుకుంది.
దాంతో విజయ్ దేవరకొండ "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" సినిమా డిజాస్టర్ తర్వాత దిల్ రాజు విజయ్ దేవరకొండ ని ఇంద్రగంటి మోహనకృష్ణతో సినిమా చేయనిస్తారా లేదా అంటున్నారు. దిల్ రాజు ధైర్యంగా ముందుకు వెళ్లి సినిమా చేద్దామా లేక వేరే డైరక్టర్ ని తీసుకొచ్చి దేవరకొండ తో సినిమా చేద్దామా అనే కన్ఫూజన్ లో ఉన్నారని సమాచారం. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ సినిమాలతో విజయ్ దేవరకొండ కు బిజినెస్ వర్గాల్లో క్రేజ్ తగ్గిందనే చెప్పాలి. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాధ్ ల కాంబోలో రావాల్సిన "జనగణమన" సినిమాకి కూడా బ్రేకులు పడ్డాయి. దాంతో ఈ ప్రాజెక్టు అంటే చాలా వరకూ దిల్ రాజు కు రిస్కే.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్‌లో మరో మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. 'ఖుషి'టైటిల్ తో రూపొందే ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. "ఖుషి" సినిమా తప్ప విజయ్ దేవరకొండ చేతిలో మరొక సినిమా లేదు. మరోవైపు హరీష్ శంకర్ ని సీన్ లోకి తెచ్చే అవకాసం ఉందంటున్నారు. త్వరలో విజయ్ దేవరకొండ కి కథ నేరెట్ చేయడానికి సిద్ధమవుతున్నారట. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఈ కథను విని ఫైనల్ కాల్ తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈసారైనా విజయ్ దేవరకొండ హిట్ అందుకుంటారో లేదో చూడాలి.