Asianet News TeluguAsianet News Telugu

ఆ మెగా హీరో సినిమాను 3 సార్లు రిజెక్ట్ చేసిన అనుష్క, కారణం ఏంటంటే..?

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది హీరోయిన్ అనుష్క శెట్టి.. అయితే అనుష్క మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాను రిజెక్ట్ చేసిందట. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ న్యూస్ లో నిజం ఎంత..? నిజం అయితే కారణం ఏంటి..? 

Heroine Anushka Shetty Rejected 3 Times Mega Powerstar Ram Charan Movies JMS
Author
First Published Nov 10, 2023, 10:29 AM IST

హీరోయిన్ గా దాదాపు రిటైర్ అయ్యింది అనుష్క శెట్టి.. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటుంది. అడపా దడపా సినిమాలు చేయడానికి సై అంటోంది. కెరీర్ లో మరీ పరుగులు పెట్టకుండా.. అలా అని నత్త నడక నడవకుండా.. చాలా కూల్ గా.. హ్యాపీగా మూవీ కెరీర్ ను కొనసాగించింది స్వీటి. టాలీవుడ్లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది బ్యూటీ. అయితే కొంత మంది స్టార్లతో మాత్రం ఆమె నటించలేదు. అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉన్నారు. అయితే రామ్ చరణ్ తో నటించే అవకాశం రాక కాదు.. వచ్చిందట. కాని స్వీటీ రిజెక్ట్ చేసిందట ఎందుకు..? 


సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది అనుష్క. మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఆమె దొరకడం చాలా కష్టంగా మారింది. వరుసగా తెలుగు తమిళ భాష సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది స్వీటి.  ప్రస్తుతం సినిమాలు పక్కన పెట్టి రెస్ట్ తీసుకుంటుంది. ఇక  తాజాగా అనుష్కకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతో కూడా నటించి మెప్పించారు. కాని రామ్ చరణ్ తో మాత్రం ఆమె నటించలేదు. అందుకు కారణం ఏంటీ అనేది ప్రస్తుతం వైరల్అవుతున్నన్యూస్. 

Heroine Anushka Shetty Rejected 3 Times Mega Powerstar Ram Charan Movies JMS

ఒక సారి కాదు..రెండు సార్లు కాదు.. ముచ్చటగా మూడు సార్లు.. మూడుసార్లు రాంచరణ్ తో నటించే అవకాశం వచ్చినప్పటికీ కూడా అనుష్క మూడు సార్లు రిజెక్ట్ చేశారట.  మరి రామ్ చరణ్ అనుష్క కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రావలసినటువంటి ఆ మూడు సినిమాలు ఏంటి అంటే.. ముందుగా వీరిద్దరి కాంబోలో మగధీర  మిస్ అయ్యిందట. రాజమౌళి రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చి.. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది మూవీ ఈసినిమాతో కాజల్ ను పంచదార బొమ్మా అని పిలవడం స్టార్ట్ చశారు. నిజానికి ఆ పంచదార బొమ్మ అనుష్క అవ్వాల్సి ఉందట. 

అయితే అయితే ఈ సినిమాలో ముందుగా రాజమౌళి అనుష్కని అనుకున్నారట ఈమె తన వ్యక్తిగత కారణాలవల్ల ఈ సినిమాను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. అయితే ఈమూవీ తరువాత రామ్ చరణ్ హీరోగా.. పక్కా మాస్ మూవీగా వచ్చిన  రచ్చ సినిమాలో కూడా ముందుగా అనుష్కకి అవకాశం వచ్చిందట. కాని  ఈ సినిమా కథ నచ్చక ఈమె ఈ సినిమాని కూడా రిజెక్ట్ చేశారట స్వీటి

ఇక వీరి కాంబోలో ముచ్చటగా మిస్ అయిన మూడో సినిమా.. గోవిందుడు అందరివాడే ఈ సినిమాలో కృష్ణవంశీ ముందుగా అనుష్కను సంప్రదించగా ఈమె అప్పటికి వేరే సినిమాతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ఛాన్స్ వదులుకున్నారట ఇలా మూడుసార్లు రాంచరణ్ తో సినిమా చేసే అవకాశం వచ్చినప్పటికీ అనుష్క  ఈ సినిమా అవకాశాలను వదులుకున్నారు అంటూ తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios