Asianet News TeluguAsianet News Telugu

'యాత్ర -2' కు దుల్కర్ నో చెప్పటానికి కారణం.. ఆ నిర్మాత హెచ్చరికే?

 “నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి నేను వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని” అంటూ.. వదిలిన యాత్ర 2 పోస్టర్ ..

Dulquer Salmaan decision to decline Yatra 2 was influenced by potential political repercussions jsp
Author
First Published Sep 9, 2023, 6:17 AM IST

స్టార్ అయ్యాక ప్రతీ విషయంలోనూ హీరోలు ఆచి తూచి అడుగు వెయ్యాల్సి ఉంటుంది.  ముఖ్యంగా వివాదాస్పదంగా ఉండటానికి, ఏ వర్గానికి దూరం కాకుండా ఉండటానికి ప్రయత్నిస్తూంటారు. అదే విధంగా దుల్కర్ సల్మాన్‌ కూడా తెలుగులో తనకంటూ క్రేజ్ సంపాదించుకుని దూసుకుపోతున్నారు. ఆ మధ్యన ఆయనకు  ఒక  తెలుగు సినిమా ఆఫర్ వచ్చింది. అదే ‘యాత్ర 2’. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో వచ్చిన ‘యాత్ర’ సినిమాకు సీక్వెల్ అది.  దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు మహి వి.రాఘవ్ తెరకెక్కించారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాత్రను ప్రముఖ మలయాళ హీరో మమ్ముట్టి పోషించారు. ఈ సినిమా వై.ఎస్.జగన్ విజయానికి తోడ్పడిందనటంలో సందేహం లేదు. 

ఇక ఇప్పుడు  2024 ఎన్నికలు లక్ష్యంగా మహి వి.రాఘవ్ దర్శకత్వంలో ‘యాత్ర 2’ తెరకెక్కుతోంది. ఈ సినిమా మొత్తం  వై.ఎస్.జగన్ చుట్టూ తిరగనుంది. తండ్రీకొడుకులు రాజశేఖరరెడ్డి, జగన్ మధ్య ఉన్న అనుబంధాన్ని, ఎమోషన్‌ను ‘యాత్ర 2’లో చూపించబోతున్నామని మహి వి.రాఘవ్ చెప్పుకొచ్చారు. మొదట ఈ సినిమాలో వైయస్ జగన్ పాత్రకు మొదట ఆప్షన్ దుల్కర్ సల్మాన్‌.  ‘యాత్ర’లో వైఎస్సార్‌గా మమ్ముట్టి చేశారు కాబట్టి.. ఇప్పుడు జగన్‌గా ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్ చేస్తే బాగుంటుందని దర్శక,నిర్మాతలు భావించారు. అంతేకాదు ఆ ప్రపోజల్ తో దుల్కర్ సల్మాన్ కలిశారట. కానీ, దుల్కర్ ఆలోచించి, తెలుగు పరిశ్రమలో తనకు ఉన్న పరిచయాలను సంప్రదించి ఈ ఆఫర్‌ను తిరస్కరించారని సమాచారం.

ముఖ్యంగా ‘యాత్ర 2’లో కనుక తాను వై.ఎస్.జగన్ పాత్ర పోషిస్తే ... తన కెరీర్ కు  పొలిటికల్‌గా చాలా ఇబ్బందులు వస్తాయని భావించారట. అంతే కాకుండా తను బాగా నమ్మి సినిమాలు చేస్తున్న తెలుగు నిర్మాత , ఓ స్టార్ హీరో నుంచి  ఆ పాత్ర చేయవద్దని ప్రెజర్ సైతం వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా కనుక చేస్తే తెలుగు పరిశ్రమకు దూరం అయ్యిపోతావని హెచ్చరించారని, దాంతో  .. తన సినిమా కెరీర్‌కు దెబ్బ అవుతుందని  దుల్కర్ సల్మాన్ దూరం పెట్టారట. ప్రస్తుతం ఉన్న పరిస్దితుల్లో తమ కమిట్మెంట్స్ తో డేట్స్ ఎడ్టెస్ట్ చేయలేనని సున్నితంగా తిరస్కరించారట.

ఇక “నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి నేను వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని” అంటూ.. వదిలిన యాత్ర 2 పోస్టర్ ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. ఈ ఒక్క డైలాగుతోనే జగన్ అభిమానులకు ఆనందం కలిగించారు. ఇక అదే సమయంలో ‘యాత్ర 2’ రిలీజ్ ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. 2024 ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కానుందని పోస్టర్ ద్వారా తెలిపారు.  ‘యాత్ర 2’ కీలక టెక్నీషియన్ల వివరాలను కూడా పోస్టర్‌లో తెలిపారు.

  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో దాదాపు ఏడాది పాటు జ‌గ‌న్ చేసిన పాద‌యాత్ర‌తో పాటు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్ట‌డం లాంటి అంశాల‌ను యాత్ర 2లో చూపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలో వైఎస్ జ‌గ‌న్ పాత్ర‌లో కోలీవుడ్ న‌టుడు జీవా క‌నిపించనున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios