#Ali:వైసీపీ కి గుడ్ బై? ఆ పార్టీలోకి జంప్
వైసీపీలో అలీ చేరిన తర్వాత ఆయనకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గాయంటున్నారు. ఈ కారణంగా సినిమా ఇండస్ట్రీ కాస్త దూరం పెట్టిందని కూడా ప్రచారం జరుగుతోంది.
నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అలీ.... రాజకీయాలకు కూడా ఈ మధ్యకాలంలో కాస్త దగ్గరగానే ఉంటూ వస్తున్నారు. 2019 ఎన్నికల ముందు అనూహ్యంగా వైసీపీలో చేరి అందరినీ ఆశ్చర్య పరిచారు . అప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నా సీట్ల సర్దుబాటులో అది కుదరలేదు. దీంతో వైసీపీ తరఫున ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. పార్టీ ముఖ్యంగా ముస్లిం ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అలీ చేత ప్రచారం చేయించింది.
పార్టీ అధికారంలోకి వస్తే అలీకి మంచి పదవి ఖాయం అంటూ ప్రచారం జరిగింది కూడా. కానీ, అది జరగలేదు. దాంతో అలీ చాలా డిజప్పాయింట్ గా ఉంటున్నట్లు సమాచారం. దాంతో త్వరలో పార్టీ మారే అవకాసం ఉందని వినికిడి. త్వరలోనే మీడియా ముఖంగా ఈ విషయాలు ప్రకటన చేస్తారు.
అలీ గతంలో తెలుగు దేశం పార్టీలో ఉండేవారు. కానీ ఇప్పుడు వెనక్కి మళ్లీ అటు సొంతగూట్లోకి వెళ్లే ఉద్దేశ్యం లేదట. పవన్ తో ఆయనకు ఉన్న స్నేహం కారణంగా జనసేనలో కనపడతారు అని ప్రచారం జరుగుతోంది. అదే నిజం అంటున్నారు సినిమా వాళ్లు.
ఇదిలా ఉంటే వైసీపీలో అలీ చేరిన తర్వాత ఆయనకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గాయంటున్నారు. ఈ కారణంగా సినిమా ఇండస్ట్రీ కాస్త దూరం పెట్టిందని కూడా ప్రచారం జరుగుతోంది. పార్టీ మారేంత వరకూ సినిమా అవకాశాలు పుష్కలంగా ఉన్న అలీకి ఇప్పుడు పూర్తిగా అవకాశాలు రావడం లేదు. దీనికి కారణం వైసీపీలో చేరడమే అంటున్నారు అలీ సన్నిహితులు.
అయితే కొత్త నీరు ఇండస్ట్రీకి రావటం, కొత్త కమిడియన్స్ పరిశ్రమలో పరిచయం కావటం, పాత డైరక్టర్స్ తగ్గటం కారణం అని సినీ వర్గాలు అంటున్నారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఇంతవరకు ప్రభుత్వంలో గానీ, పార్టీలో గానీ ఎలాంటి పదవీ రాలేదు. అటు సినిమాలు లేక.. ఇటు పదవీ రాక తనలో తానే ఆందోళన చెందుతున్నారట అలీ.
ఇదిలా ఉంటే సినిమా రంగం నుంచి పోసాని, అలీ లాంటి వాళ్లు వైసీపికి మద్దతు ఇచ్చినా ఇంత వరకూ ఎవరికీ ఎలాంటి పదవులు ఇవ్వలేదు సీఎం జగన్. పృధ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చినా.. కొన్ని ఆరోపణల కారణంగా ఆ పదవిని వదులుకోవలసి వచ్చింది. ఆయన మినహా ఇతరులెవరికీ పదవులు దక్కలేదు.