Asianet News TeluguAsianet News Telugu

#GodFather:అన్ని ఏరియాలు సొంత రిలీజ్? కారణం ఏంటి

 మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్'(God Father) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార(Nayanthara), సత్యదేవ్(Satyadev) కీలకపాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది.

Chiranjeevi GodFather All Areas Own Release?
Author
First Published Sep 25, 2022, 9:50 AM IST


సినిమా పూర్తయ్యాక...రిలీజ్ కు ముందు  బిజినెస్ పూర్తవ్వాలని ప్రతీ నిర్మాత కోరుకుంటాడు. ఎక్కడో కొన్ని సినిమాలుపై పూర్తి నమ్మకం ఉండటం లేదా బిజినెస్ ఆఫర్స్ అనుకున్న స్దాయిలో రాకపోవటంతో సొంత రిలీజ్ వెళ్తారు. ఇప్పుడు చిరంజీవి తాజా చిత్రం గాడ్ ఫాధర్ సైతం సొంత రిలీజ్ కు అన్ని ఏరియాల నుంచి వెళ్తున్నారని వినికిడి. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఈ వార్తను అడ్డం పెట్టుకుని కొందరు నెగిటివ్ కామెంట్స్ స్ప్రెడ్ చేస్తున్నారు.  

 మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్'(God Father) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార(Nayanthara), సత్యదేవ్(Satyadev) కీలకపాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ వేగం పెంచేశారు. ఇటీవల సినిమా టీజర్, ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా.. మేకర్స్ ఈ సినిమాకి సంబంధించి అన్ని ఏరియాలకు సొంత రిలీజ్ జరుగుతోందని తెలుస్తోంది. అందుకు కారణం ఆచార్య ఇంపాక్ట్ తో అనుకున్న స్దాయిలో బిజినెస్ కావటం లేదని అంటున్నారు. 

అయితే అలాంటిదేమీ లేదు...సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో చిరంజీవి సూచన మేరకు సొంత రిలీజ్  చేస్తున్నారని చెప్తున్నారు.  మరో ప్రక్క రీసెంట్ గా నాన్ థియేట్రికల్ రైట్స్ ను అమ్మేసినట్లు తెలుస్తోంది.  ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఫ్యాన్సీ రేటుకి ఈ హక్కులను అమ్మారు. ఎంత మొత్తమనేది బయటకు రాలేదుత్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రానుంది.
  
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ఇందులో క్యామియో రోల్ పోషిస్తున్నారు. చిరంజీవికి బాడీగార్డ్ లా కనిపించే రోల్ ఇది. కానీ సినిమా మొత్తం సల్మాన్ కనిపించరు. ఒక యాక్షన్ సీన్ లో ఆయన క్యారెక్టర్ ని హైలైట్ చేసి చూపించబోతున్నారు.  ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ సతీమణి  కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మెహర్ రమేష్ సినిమాలో ‘భోళా శంకర్’, బాబీ దర్శకత్వం మరో సినిమా చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios