Bheemla Nayak:‘భీమ్లా నాయక్‌’ @ 225 కోట్ల ఆఫ‌ర్‌! అసలు మేటర్ ఇదీ

 ఈ ప్రచారం లో భాగంగానే  నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాని ఏక మొత్తం గా.. 225 కోట్ల‌కు కొన‌డానికి ముందుకొచ్చింద‌ని చెప్తున్నారు. 

Bheemla Nayak Got 227 Crore Bumper Offer From Netflix

ప్రతీ పెద్ద సినిమాకూ డైరక్ట్ ఓటీటి ఆఫర్స్ వస్తున్నాయి. క్రేజ్ ఉన్న సినిమాలను తమ ఓటీటిలలో వేస్తే కనుక వ్యూయర్ షిప్ పెరగటమే కాకుండా, సబ్ స్కైబర్స్ పెరుగుతారనేది వారి ఓటీటి సంస్దల ఆశ. దాంతో వారంతా పెద్ద సినిమాలు చేస్తున్న నిర్మాతల చుట్టూ ప్రదిక్షణాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో రకరకాల వార్తలు మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి. వాటిలో కొన్ని రూమర్స్ గా తేలిపోతున్నాయి. రీసెంట్ గా అలాంటి వార్త ఒకటి ‘‘భీమ్లా నాయక్‌’ గురించి మీడియాలో చక్కర్లుకొడుతోంది. ఆ వార్తలో నిజమెంత అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

పవన్ గత చిత్రం వ‌కీల్ సాబ్ కి అవాతరాలు క‌లిగించిన వైకాపా... ఇప్పుడు భీమ్లా నాయ‌క్ ని ఏదోలా అడ్డుకోవాల‌ని చూస్తోందంటున్నారు. అందుకే చిత్ర‌టీమ్... ఓటీటీవైపు కూడా దృష్టి సారించిందట. జ‌న‌వ‌రి 12న ఈసినిమాని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌డానికి ప‌వ‌న్ రెడీగా ఉన్నా, నిర్మాత‌లు సెకండ్ ఆప్ష‌న్ కూడా ఆలోచిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం లో భాగంగానే  నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాని ఏక మొత్తం గా.. 225 కోట్ల‌కు కొన‌డానికి ముందుకొచ్చింద‌ని చెప్తున్నారు. ఇదే నిజమైతే అసలు ఎవరూ ఊహించని బ్ర‌హ్మాండ‌మైన ఆఫ‌ర్‌. 225 కోట్ల‌కు ఈ సినిమాను కనుక  అమ్మేస్తే... నిర్మాత‌ల‌కు భారీ లాభాలు గ్యారెంటీ. రిస్క్ అసలు ఉండదు. 

Also read Megastar Record: చిరంజీవి వరల్డ్ రికార్డ్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్.. డిటెయిల్స్

 ఈ విష‌యమై ఓ టీవీ ఛాన‌ల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఓ జ‌న‌సేన నేత‌.. ఈ ఓటీటీ ఆఫ‌ర్ గురించి ప్ర‌స్తావించాడు. అయితే అది ఎంత వ‌ర‌కూ న‌మ్మ‌శ‌క్యం అనేది మాత్రం తెలీటం లేదంటున్నారు.   225 కోట్లంటే క‌ళ్లు మూసుకుని ఇచ్చేయ‌చ్చు అంటోంది ట్రేడ్.  అయితే నెట్ ప్లిక్స్ బిజినెస్ మోడల్ చూస్తే మాత్రం ఇది రూమర్ అనిపిస్తుంది. ఎందుకంటే నెట్ ప్లిక్స్ సినిమా రైట్స్ తీసుకునే ముందు రికవరీ సమయం...ఎంత పెడితే వర్కవుట్ అవుతుందనే లెక్కలుతో ముందుకు వస్తుంది. ఓ రీజనల్ లాంగ్వేజ్ ఫిల్మ్ అదీ రీమేక్ అంటే ఆ రేటు ఇవ్వరు అంటున్నారు. అసలు అలాంటి ప్రపోజల్ ఏదీ నెట్ ప్లిక్స్ నుంచి రాలేదంటున్నారు. నెట్ ప్లిక్స్ రైట్స్ కోసం అడిగిన మాట నిజమే కానీ ..అంత మొత్తం మాత్రం కోట్ చెయ్యలేదట.ఈ వార్తను కావాలనే ప్రచారం లోకి కొందరు తీసుకొచ్చారంటున్నారు.

Also read Adavi Thalli Maata: ఫోక్ బీట్ లో సాగిన మాస్ సాంగ్... అలరిస్తున్న భీమ్లా నాయక్ కొత్త పాట

ఇదిలా ఉంటే ‘భీమ్లా నాయక్‌’ రిలీజ్ డేట్ ని మరోసారి నిర్మాతలు ఖరారు చేసిన సంగతి తెలిసిందే.  పవన్‌ కల్యాణ్‌, రానా హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రమిది. సాగర్‌ కె. చంద్ర దర్శకుడు. ఈ సినిమాని 2022 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్టు చిత్ర టీమ్ ఎప్పుడో ప్రకటించింది. అయితే, అదే సీజన్‌లో మరికొన్ని భారీ ప్రాజెక్టులు ప్రేక్షకుల ముందుకొస్తుండటంతో ఈ సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయంటూ గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. సదరు వార్తలపై స్పందించిన మూవీ టీమ్‌ ‘అనుకున్న రోజునే విడుదల చేస్తాం’ అని క్లారిటీ ఇచ్చింది. ‘ఈ సినిమా సంక్రాంతికి లేనట్టే’ అనే కథనాలు నెట్టింట మళ్లీ దర్శనమిస్తుండటంతో చిత్ర టీమ్ మరోసారి స్పష్టతనిచ్చింది. ‘‘భీమ్లా నాయక్‌’.. 2022 జనవరి 12న మీ ముందుకొస్తుంది’ అని తెలిపింది. 

మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’ చిత్రానికి రీమేక్‌గా ‘భీమ్లా నాయక్‌’ రూపొందుతోంది. నిత్యా మేనన్‌, సంయుక్త మేనన్‌ హీరోయిన్స్. దర్శకుడు త్రివిక్రమ్‌ మాటలు రాస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios