Adavi Thalli Maata: ఫోక్ బీట్ లో సాగిన మాస్ సాంగ్... అలరిస్తున్న భీమ్లా నాయక్ కొత్త పాట

 జనవరి 14న భీమ్లా నాయక్ విడుదల కానుంది. రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉండగా... వరుస సాంగ్స్ విడుదల చేస్తున్నారు. నేడు భీమ్లా నాయక్ నుండి మరో సాంగ్ 'అడవి తల్లి మాట...' విడుదలైంది. 
 

adavi thalli maata song from bheemla nayak out now

భీమ్లా నాయక్ (Bheemla nayak)సంక్రాంతి బరిలో దిగడం ఖాయమే. ఆర్ ఆర్ ఆర్ నిర్మాతలు విన్నపాలు పట్టించుకోని భీమ్లా నాయక్ టీమ్ ఫుల్ గా డిసైడ్ అయ్యారు.దీంతో జనవరి 14న భీమ్లా నాయక్ విడుదల కానుంది. రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉండగా... వరుస సాంగ్స్ విడుదల చేస్తున్నారు. నేడు భీమ్లా నాయక్ నుండి మరో సాంగ్ 'అడవి తల్లి మాట...' విడుదలైంది. 


భీమ్లా నాయక్ లో పవన్ కళ్యాణ్ ది అడవి తెగలో పుట్టిన వ్యక్తి నేపథ్యం. దీంతో సాంగ్స్ జానపదాలను తలపించేలా రూపొందిస్తున్నారు. అడవి తల్లిమాట సాంగ్ సైతం అదే యాసలో, భాషలో సాగింది. ఫోక్ సాంగ్స్ ని తలపించేలా మాస్ గా ఉన్న అడవి తల్లి మాట సాంగ్.. పవన్ (Pawan kalyan), రానా మధ్య నడిచే ఆధిపత్య పోరును తెలియజేస్తుంది. పవన్ గత చిత్రాలకు భిన్నంగా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ మూవీలో సాంగ్స్ కూడా చాలా భిన్నంగా ఉన్నాయి.

 
అడవి తల్లిమాట (Adavi Thalli Maata)సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. తమన్ స్వరాలు సమకూర్చగా కుమ్మరి దుర్గవ్వ, సాహితీ చాగంటి పాడారు. ఈసాంగ్ ద్వారా దుర్గవ్వ అనే మరో మట్టిలో మాణిక్యాన్ని పరిచయం చేసినట్లు తెలుస్తుంది. సాంగ్ మాత్రం వినసొంపుగా... ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగించేదిగా ఉంది. 

Also read Bheemla Nayak: భీమ్లానాయక్​ నుంచి క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ కోసం గ‌ళం విప్ప‌నున్న పవన్​ ! ఇక పునకాలే!
ఇక భీమ్లా నాయక్ అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రానికి అధికారిక రీమేక్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు అందించడం జరిగింది. పవన్ కి జంటగా నిత్యా మీనన్ నటిస్తున్నారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios