Asianet News TeluguAsianet News Telugu

‘భగవంత్‌ కేసరి’ స్టోరీ లైన్ ఇదేనా?

శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో కనిపించబోతుంది అని దర్శకుడు అనిల్ రావిపూడి ముందుగానే చెప్పేశాడు. అయితే ఈ చిత్రం కథ ఇదేనంటూ  ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ ఇన్సైడ్ టాక్ ప్రకారం..

Bhagavanth Kesari Censor Runtime Story and Cast Details JSP
Author
First Published Oct 17, 2023, 1:38 PM IST

 బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari). ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. బాల‌కృష్ణ‌కు ఉన్న క్రేజ్ కార‌ణంగా భ‌గ‌వంత్ కేస‌రి అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలోనే జ‌రిగాయి. రిలీజ్‌కు మూడు రోజుల ముందే రెండు కోట్ల‌కు వ‌ర‌కు అడ్వాన్స్ బుకింగ్స్ జ‌రిగాయి.  U/A తో సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రన్ టైం 164 నిమిషాల, 30 సెకండ్లు గా బయిటకు వచ్చింది. 

ఇక సెన్సార్ రిపోర్ట్ చాలా పాజిటివ్ గా ఉంది, ఇండస్ట్రీ బజ్ కూడా సినిమాపై చాలా పాజిటివ్ గా ఉంది. అనిల్ రావిపూడి తన స్టైల్‌ని పూర్తిగా మార్చుకుని ఈసారి కథపై కాన్సంట్రేట్ చేసి భగవంత్ కేసరి క్యారెక్టరైజేషన్‌ని చాలా బాగా డిజైన్ చేసారని సెన్సార్ రిపోర్ట్ చెబుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం స్టోరీలైన్ అంటూ ఒకటి బయటకు వచ్చింది. అదేమిటంటే...కొన్ని తప్పనిసరి పరిస్దితుల్లో  జైలుకు వెళ్లిన  భగవంత్ కేసరికు జైలర్ ఒక పని అప్పచెప్తాడు. తన కూతురుని విలన్స్ నుంచి రక్షించమని. అందుకోసం భగవంత్ కేసరి ఇరవై నాలుగు గంటలు కష్టపడి ఆమెను స్ట్రాంగ్ గా చెయ్యాలనకుంటాడు. అంతే కాదు విలన్స్ తో ఫైట్ కు దిగుతాడు. వాళ్లు ఊహించని ఓ ట్విస్ట్ ఇస్తాడు. ఇంతకీ జైలర్ కు విలన్ కు ఉన్న విరోధం ఏమిటి... విలన్స్ కు ఇచ్చే మతిపోయే ఆ ట్విస్ట్ ఏమిటనేది మెయిన్ కథ అంటున్నారు. అయితే భగవంత్ కేసరి ప్లాష్ బ్యాక్ లో ఓ పోలీస్ అధికారి అని తెలుస్తోంది. అది చాలా పరవ్ ఫుల్ గా ఉండబోతోందని వినికిడి.  ఎమోషన్స్ -ఎంటర్‌టైన్‌మెంట్ ను బ్యాలెన్స్ చేస్తూ బాలకృష్ణ అద్భుతంగా నటించినట్టు  క్లారిటీ రావడంతో ఈ సినిమా మీద పాజిటివ్ వైబ్స్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.  

‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’లతో వరుసగా బ్లాక్‌ బస్టర్‌ విజయాలను అందుకున్న బాలకృష్ణ (Balakrishna)ఈ సినిమాతో హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకోవాలని ఫ్యాన్స్‌ ఆశపడుతున్నారు. ఇప్పటికే దీని టీజర్‌కు భారీ స్పందన రాగా.. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కూడా మిలియన్‌ వ్యూవ్స్‌తో యూట్యూబ్‌లో సందడి చేస్తోంది. బాలకృష్ణ మార్క్‌ యాక్షన్‌ అంశాలతో పాటు అనిల్‌ శైలి వినోదాలతో మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ముస్తాబవుతోంది. ఇందులో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల, అర్జున్‌ రాంపాల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సౌత్ ఇండియా నుంచి భారీ అంచనాలతో వస్తున్నా సినిమాలు బాలయ్య “భగవంత్ కేసరి”, మాస్ మహారాజ రవితేజ “టైగర్ నాగేశ్వరరావు” అలాగే తమిళ్ డబ్బింగ్ చిత్రం విజయ్ నటించిన “లియో” చిత్రాలు ఉన్నాయి. మరి ఆసక్తికరంగా ఈ మూడు చిత్రాలపై కూడా తెలుగు ఆడియెన్స్ లో మంచి అంచనాలు నెలకొనగా ఇపుడు ఈ సినిమాలు బుకింగ్స్ అయితే తెలుగు స్టేట్స్ లో మొదలైపోయాయి. హైదరాబాద్ సహా ఇతర ముఖ్య ప్రాంతాల్లో అయితే ఈ బుకింగ్స్ స్టార్ట్ కాగా ఇక ఈరోజు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూడు చిత్రాలకి బుకింగ్స్ మొదలు కానున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios