Balakrishna: 'ఎఫ్ 3' చూసాక స్క్రిప్టు మార్చమన్న బాలయ్య?
ఎఫ్3 సినిమా తరువాత నందమూరి బాలకృష్ణతో మూవీ చేస్తున్నట్లు అనిల్ రావిపూడి తెలిపాడు. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్ మొదలు పెడతామన్నాడు. బాలయ్య ఎంతో పవర్ ఫుల్‌గా ఉంటారో..
హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఎఫ్ 3 ప్రత్యేక ప్రిమియర్ షోని రీసెంట్ గా ప్రసాద్ ల్యాబ్స్ లో చూసారు బాలకృష్ణ. ఎఫ్ 3 సినిమాపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఇక ఎఫ్ 3 చిత్రం అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ గా వుంది. సినిమాని చాలా ఎంజాయ్ చేశాను. ఇంత మంచి ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్ టైనర్ ని ప్రేక్షకులకు అందించిన ఎఫ్ 3చిత్ర యూనిట్ కి అభినందనలు” తెలిపారు నటసింహ నందమూరి బాలకృష్ణ. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఈ సినిమా చూసాక అనీల్ రావిపూడిని స్క్రిప్టు మార్చమని కోరారట బాలయ్య. అందుకు కారణం ..ఇంత మంచి ఫన్ ని తన సినిమాలోనూ ఎడాప్ట్ చేయమని కోరారట.
ఎఫ్3 సినిమా తరువాత నందమూరి బాలకృష్ణతో మూవీ చేస్తున్నట్లు అనిల్ రావిపూడి తెలిపాడు. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్ మొదలు పెడతామన్నాడు. బాలయ్య ఎంతో పవర్ ఫుల్‌గా ఉంటారో.. అందుకు తగినట్లే ఆ సినిమా కూడా ఉంటుందన్నాడు. అయితే ఆ సినిమాలో ఫన్ అంత పెద్దగా ఉండదన్నాడు. తాము ఇద్దరం కలిసి కొత్త మార్క్‌లో ఆడియన్స్ ముందుకు వస్తామని చెప్పాడు అనిల్ రావిపూడి. అయితే ఇప్పుడు అనీల్ రావిపూడిని అలా పూర్తి యాక్షన్ తో వద్దని నీ మార్క్ తోనే ముందుకు వెళ్దామని బాలయ్య కోరినట్లు వినపడుతోంది. దాంతో అనీల్ రావిపూడి ఇప్పుడు స్క్రిప్టు మార్చే పనిలో ఉన్నట్లు సమాచారం.
ఈ సినిమాలో శ్రీలీల ముఖ్య పాత్ర పోషించనున్నారు. అయితే బాలకృష్ణ సరసన హీరోయిన్ గా కాకుండా శ్రీలీల ఈ సినిమాలో బాలకృష్ణ కూతురి పాత్రలో కనిపించబోతున్నారు అని స్వయంగా అనీల్ రావిపుడి తెలియచేసారు. ఇక బాలకృష్ణ ని అనిల్ రావిపూడి ఒక సరికొత్త అవతారంలో చూపించబోతున్న సంగతి తెలిసిందే. మరి తండ్రి కూతురు లాగా బాలకృష్ణ మరియు శ్రీలీల నటిస్తే ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నాడు బాలయ్య. బాలయ్య 107 వ చిత్రం గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కు తు ఉండగా అది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.