Balakrishna:ఈసారి బాలయ్య పుట్టిన రోజు గిప్ట్ ,పండగ చేసుకునేలా ఉంటుంది

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సిరిసిల్లలో ప్రారంభమైంది అక్కడ ఫస్ట్ షెడ్యూల్ పూర్తైయింది. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ కూడా సిరిసిల్లలో ఫైట్ సీక్వెన్స్‌తో ప్రారంభమైంది.  
 

Balakrishna Birthday Present On The Way

నందమూరి నటసింహం బాలకృష్ణ త్వరలో (జూన్ 10) తన 62వ పుట్టినరోజును జరుపుకోబోతున్నారు.  బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం నుంచి ఓ గిప్ట్ ని రెడీ చేసారట.  బాలయ్య గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. NBK107 పేరుతో వస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక బర్త్ డే సందర్భంగా బాలయ్యకు విషెష్ చెప్తూ... ఈ చిత్రంకు సంభందించిన టీజర్ ని వదలబోతున్నట్లు సమాచారం. లాస్ట్ ఇయిర్ కూడా ఇదే టీమ్  బాలయ్యకు పుట్టిన రోజు విషెస్ తెలుపుతూ ఓ చిన్న వీడియోను విడుదల చేశారు. హంట్ స్టార్ట్స్ సూన్ అంటూ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇప్పుడు అదిరిపోయే టీజర్ ని రెడీ చేసారని సమాచారం.

గోపీచంద్ మలినేని బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్  టీజర్ రెడీ చేసినట్లు సమాచారం. ఈ సినిమా యాధార్థ ఘటనల ఆధారంగా ఉండనుందట. ఈ కథలో బాలకృష్ణ ఫ్యాక్షన్ లీడర్, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. ఈ రెండు పాత్రలను కవర్ చేస్తూ ఈ టీజర్ ఉండదట. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సిరిసిల్లలో ప్రారంభమైంది అక్కడ ఫస్ట్ షెడ్యూల్ పూర్తైయింది. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ కూడా సిరిసిల్లలో ఫైట్ సీక్వెన్స్‌తో ప్రారంభమైంది.  

ఈ మూవీలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో  కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో దునియా విజయ్.. ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి బాలయ్య పై గోపీచంద్ మలినేని శేఖర్ మాస్టర్ నేతృత్వంలో ఓ మాస్ సాంగ్‌ను పిక్చరైజ్ చేసారు.తాజాగా పిక్చరైజ్ చేసిన ఈ పాటను బాలకృష్ణ, డింపుల్ హయతిలపై పిక్చరైజ్ చేసినట్టు టాక్.  మరోవైపు ఈ సినిమాలో మరో లేడీ పవర్ ‌ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్‌ను తీసుకున్నారు. 

గతేడాది చివర్లో  బాలయ్య.. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో చేసిన ‘అఖండ’ (Akhanda)సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘అఖండ’ సక్సెస్‌తో ఇండస్ట్రీ బడా హీరోలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమా  దాదాపు 100 కు పైగా థియేటర్స్‌లో  50 రోజులు పూర్తి చేసుకుని సంచలనం రేపింది. పెద్ద సినిమాలు రిలీజైతే.. ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారా రారా అన్న అనుమానాలు ‘అఖండ’ మాస్ జాతరతో  పటా పంచలైపోయాయి.ఆ సంగతి పక్కన పెడితే.. ‘అఖండ’ ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్ల వరకు  గ్రాస్ వసూళ్లను సాధించినట్టు చిత్ర యూనిట్ అధికారికంగా పేర్కొంది. మొత్తంగా రూ. 80 నుంచి రూ. 85  కోట్ల వరకు షేర్ సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రీసెంట్‌గా ‘అఖండ’ మూవీ  హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ కూడా ఎక్కువ మంది చూసిన సినిమా ‘అఖండ’ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios