Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా ?

 ఇంకా షూటింగ్ పెండింగ్ ఉన్న    'భగవంత్‌ కేసరి’ని అనుకున్న టైమ్ కు తేవటం కష్టమనే మాట వినపడుతోంది. అయితే దర్సకుడు అనీల్ రావిపూడి మాత్రం బాలయ్యలేని..

Balakrishna Bhagawant Kesari Out Of Dasara Race? JSP
Author
First Published Sep 16, 2023, 7:47 AM IST


బాలయ్య సినిమా అంటే భాక్సాఫీస్ దగ్గర భీబత్సమైన అంచనాలు ఉంటాయి. ఆయన  'భగవంత్‌ కేసరి’గా దసరా బరిలో దుమ్ములేపేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్‌ హీరోయిన్. అర్జున్‌ రాంపాల్‌, శ్రీలీల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. దసరా కానుకగా అక్టోబరు 19న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామన్నారు. ‘భగవంత్‌ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది’ గన్స్‌ పట్టుకుని బాలకృష్ణ నడిచి వస్తున్న ఫొటోతో ఫ్యాన్స్ లో జోష్ నింపారు. నాలుగు  రోజులు క్రితం దాకా అంతా అనుకున్నట్లే జరుగుతుందని దసరాకు మామూలుగా ఉండదని నందమూరి అభిమానులు లెక్కలు వేసారు. అయితే ఊహించని ట్విస్ట్ పడబోతోందని వార్తలు వస్తున్నాయి.

సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు   'భగవంత్‌ కేసరి’వాయిదా పడే అవకాసం ఉందని తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన నేపధ్యంలో బాలయ్య ఇప్పుడు పార్టీ తరుపున ప్రెస్ మీట్స్ పెట్టడం, లీడ్ తీసుకోవటం చేస్తున్నారు. దాంతో ఇంకా షూటింగ్ పెండింగ్ ఉన్న    'భగవంత్‌ కేసరి’ని అనుకున్న టైమ్ కు తేవటం కష్టమనే మాట వినపడుతోంది. అయితే దర్సకుడు అనీల్ రావిపూడి మాత్రం బాలయ్యలేని సీన్స్ షూట్స్ ప్లాన్ చేసి ఫినిష్ చేస్తున్నట్లు వినికిడి. బాలయ్య మరో ఐదారు రోజులు చేస్తే షూటింగ్ పార్ట్ ఫినిష్ అవుతుందని చెప్తున్నారు. అదే నిజమైతే రిలీజ్ ఫోస్ట్ ఫోన్ అవసరం ఉండదు. మరో ప్రక్క లియో, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు షెడ్యూల్ ప్రకారం థియేటర్స్ లోకి వచ్చేస్తున్నాయి. 
  
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు 'భగవంత్ కేసరి' కి అదిరిపోయే బిజినెస్ జరుగుతోంది.  థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ద్వారా 'భగవంత్ కేసరి'కి వచ్చిన రూ. 60 కోట్లు ప్రక్కన పెడితే... ఓటీటీ / డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ద్వారా రూ. 36 కోట్లు వచ్చినట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఓటీటీ హక్కులను సొంతం చేసుకుందని టాక్. విడుదలకు ముందు నిర్మాతలకు దాదాపుగా 100 కోట్లు వచ్చాయి.

 'భగవంత్ కేసరి'కి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 62 కోట్లు.  దసరా బరిలో సినిమా విడుదల అవుతుంది కనుక  సినిమా ఓ మాదిరిగా ఉన్నా దుమ్ము రేపుతుంది. ఇక సూపర్ గా ఉంటే చెప్పక్కర్లేదు.  దసరా అక్టోబర్ 19 గురువారం వచ్చింది. అప్పటి నుంచి 24వ తేదీ పండగ వరకు సెలవులు ఉంటాయి కనుక మంచి కలెక్షన్స్  వచ్చే అవకాశం ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios