Acharya: చిరు ‘ఆచార్య’ లో అనుష్క, నిజమెంత?
ఈ సినిమానుంచి హీరోయిన్ కాజల్ ను తొలగించినట్లు డైరెక్టర్ వివరణ ఇవ్వడంతో ఆమె అభిమానులు షాక్ అయ్యారు. చిత్రం మధ్యలో నుంచి తొలిగిస్తే... చిరుకు హీరోయిన్ లేకుండా పోతుందని మెగా ఫ్యాన్స్ కొంత నిరాశ వ్యక్తం చేసున్నారు. ఈ నేపధ్యంలో
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఈనెల 29న మన ముందుకు రావటానికి ముస్తాబు అయ్యింది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ ఎక్సపెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో చిరు లుక్ సరికొత్తగా ఉండనుండటం,రామ్ చరణ్ కూడా కలిసి నటిస్తూండటంతో ఓపినింగ్స్ ఓ రేంజిలో వస్తాయని భావిస్తున్నారు. ట్రేడ్ మొత్తం ఆచార్య మూవీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
టీమ్ సైతం ప్రమోషన్ల జోరును పెంచేసిన మేకర్స్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా విశేషాలను షేర్ చేస్తూ అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేస్తున్నారు. అదే సమయంలో ఈ సినిమానుంచి హీరోయిన్ కాజల్ ను తొలగించినట్లు డైరెక్టర్ వివరణ ఇవ్వడంతో ఆమె అభిమానులు షాక్ అయ్యారు. చిత్రం మధ్యలో నుంచి తొలిగిస్తే... చిరుకు హీరోయిన్ లేకుండా పోతుందని మెగా ఫ్యాన్స్ కొంత నిరాశ వ్యక్తం చేసున్నారు. ఈ నేపధ్యంలో ఆ ఇబ్బందిని అధిగమనించటానికి కొరటాల ఓ స్కెచ్ వేసినట్లు సమాచారం. అదే అనుష్క.
ఆచార్య లో చిరు సరసన అనుష్క కనిపించనున్నదట.. ఓ పాటలో ఆమె కనిపించనుందట. ఆమె స్పెషల్ అప్పీరియన్స్ అని చెప్తున్నారు. అయితే అది పుట్టించిన రూమరా...నిజమా అని తెలియాల్సి ఉంది. నిజమైతే ఆచార్య కు ఎంత వరకూ ప్లస్ అవుతుందో చూడాల్సి ఉంటుంది. స్టాలిన్ లో చిరు సరసన స్టెప్పులు వేసిన అనుష్క మళ్లీ ఇన్నాళ్లకు మరోసారి మెగాస్టార్ తో చిందులు వేస్తే మాత్రం పండగే. అనుష్క గతంలో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చిలో చేసింది. అలాగే అనుష్క సైతం రీఎంట్రీకు సిద్దంగా ఉంది. ఆమె లావు అయ్యింది...అని వస్తున్న వార్తలకు కూడా చెక్ పెట్టే అవకాసం ఉంటుంది.