Asianet News TeluguAsianet News Telugu

మెగాస్టార్ సరసన అనుష్క...ఆల్మోస్ట్ కన్ఫర్మ్

అనుష్క హోమ్ బ్యానర్  లాంటి ప్రొడక్షన్ యువి లోనే ఈ చిత్రం తెరకెక్కనుంది.  ఈ మూవీలో హీరోయిన్ గా అనుష్క కన్ఫర్మ్ అయితే మాత్రం కచ్చితంగా రేర్ కాంబినేషన్ అవుతుంది. 

Anushka in Chiranjeevi, Vasishta Movie jsp
Author
First Published Sep 16, 2023, 10:49 AM IST


అనుష్క పెద్దగా సినిమాలు చేయటం లేదు. ‘సూపర్’ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టి ‘బాహుబలి’తో ప్యాన్ఇండియా స్టార్ అయింది.  ఈ మధ్య ఆమె గ్లామర్‌‌ రోల్స్‌ను పక్కనబెట్టి, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టింది. ఆ తర్వాత ‘నిశ్శబ్దం’ సినిమా వచ్చి రెండేళ్లవుతున్నా మళ్లీ తెరపైకి రాలేదామె.తాజాగా తమ మాతృసంస్దలాంటి యూవీ క్రియేషన్స్ సంస్థలో సినిమా చేసింది. ఇందులో నవీన్ పోలిశెట్టి మరో కీలకపాత్ర పోషించాడు. ‘రారా కృష్ణయ్య’ ఫేమ్ పి.మహేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్లాస్ సెంటర్లలలో, యుఎస్ లో బాగానే వర్కవుట్ అయ్యింది. 

ప్రస్తుతం ఆమె మరో సినిమా కమిటవ్వబోతోందని తెలుస్తోంది. అది కూడా తెలుగు అవటం చెప్పుకోదగ్గ విశేషం. ఈ  మూవీకి సంబందించి చర్చలు జరుగుతున్నాయని వినికిడి.  పాన్ ఇండియా మూవీ గా రూపొందే ఈ చిత్రం సోషియో ఫాంటసీ కథతో రూపొందనుంది. అది మరోదో కాదు చిరంజీవి హీరోగా రూపొందుతున్న చిత్రం అని తెలుస్తోంది. ఈ మేరకు ఇంకా ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు కానీ కథ చెప్పారని తెలుస్తోంది.  యంగ్ డైరెక్టర్ వశిష్ట తో రూపొందే ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

అనుష్క హోమ్ బ్యానర్  లాంటి ప్రొడక్షన్ యువి లోనే ఈ చిత్రం తెరకెక్కనుంది.  ఈ మూవీలో హీరోయిన్ గా అనుష్క కన్ఫర్మ్ అయితే మాత్రం కచ్చితంగా రేర్ కాంబినేషన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వీరిద్దరూ జోడీగా మూవీ రాలేదు. ఆమె కన్ఫర్మేషన్ ఇస్తే అఫీషియల్ గా ఎనౌన్స్ చేయాలని అనుకుంటున్నారంట. అయితే ఈ బ్యూటీ ప్రస్తుతం ఫిట్ నెస్ పై దృష్టి పెట్టి స్లిమ్ అయ్యే పనిలో ఉన్నట్లుగా టాక్ నడుస్తోంది. అందుకే మీడియాకి కూడా కనిపించడం లేదని సమాచారం. 

తన తొలి చిత్రం ‘బింబిసార’తో మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన వశిష్ట మల్లిడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ లాంటి మరో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవిని చూడాలని అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. అలాంటి సినిమానే ఇది అంటున్నారు.  చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒక ఫాంటసీ మూవీకి సైన్ చేయడం విశేషం. 

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వి వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న #మెగా157 చిరంజీవి కెరీర్‌లోనే మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ చిత్రంగా వుండబోతోంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ఈరోజు అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఈ సినిమాతో వశిష్ట మనకు మెగా మాస్ యూనివర్స్ చూపించబోతున్నారు.మెగాస్టార్‌ చిరంజీవితో అత్యంత భారీ వ్యయంతో నిర్మించనున్న #Mega157ను మాస్టర్ పీస్ గా రూపొందించడం ఖాయంగా కనిపిస్తోంది. అలాంటి సినిమాలో అనుష్క నటిస్తే ఆ కిక్కే వేరు.  ప్రస్తుతం ఈ సెన్సేషనల్ న్యూస్ ట్రెండింగ్ అవుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios