వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. చిన్నిసినిమాలతో మొదలు పెట్టి ఏకంగా సూపర్ స్టార్‌ ను డైరెక్టర్ చేసే రేంజ్‌కు వచ్చిన అనిల్ ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ దర్శకుడు. తొలి సినిమా నుంచే తనదైన కామెడీ టైమింగ్ తో కమర్సియల్ ఎంటర్‌టైనర్‌లను రూపొందిస్తున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించేందుకు స్టార్ హీరోలు కూడా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

ఈ సంక్రాంతి సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇండస్ట్రీ హిట్ తో సత్తా చాటాడు. ఈ సినిమా సక్సెస్‌ తరువాత అనిల్ రేంజ్‌ మరింత పెరిగిపోయింది. దీంతో అనిల్ తో సినిమా చేయాలని చాలా మంది టాప్‌ స్టార్స్‌ ముందుకు వస్తున్నారు. మహేష్‌ బాబు కూడా తనతో మరో సినిమా చేయాలని అనిల్ ను కోరినట్టుగా వార్తలు వినిపించాయి.

అయితే అనిల్ మాత్రం సూపర్‌ స్టార్ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ తో వెంటనే మరో సినిమా చేసే అవకాశం వచ్చినా.. వెంటనే సినిమా చేయటం కుదరదని కాస్త గ్యాప్‌ తీసుకొని తప్పకుండా సినిమా చేస్తానని చెప్పాడట అనిల్. అయితే అనిల్ అలా ఎందుకు చెప్పాడన్న చర్చ జరుగుతోంది.

గతంలో అనిల్ రావిపూడి, బాలకృష్ణ హీరోగా రామారావు గారు పేరుతో ఓ సినిమాను ప్లాన్ చేశాడు. అంతా ఒకే అనుకున్న సమయంలో ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు మరోసారి బాలయ్యతో సినిమా చేసేందుకు ఆలోచిస్తున్నాడట అనిల్. అందుకే మహేష్ తో సినిమా చేసే ఛాన్స్ వచ్చినా కాదన్నాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.