Pushpa 2: అల్లు అర్జున్ కే అంత రెమ్యూనరేషన్‌ ఇచ్చేస్తే.. సినిమా బడ్జెట్ ఎంత పెట్టాలి?

 పుష్ప: ది రైజ్ హిందీ బెల్ట్‌లో ఓ రేంజిలో బిజినెస్  చేయడంతో, నిర్మాతలు బడ్జెట్‌ను పెంచడానికి అంగీకరించారు. ఈ సీక్వెల్ కోసం అల్లు అర్జున్, సుకుమార్ రెమ్యూనరేషన్ కూడా పెంచారని సమాచారం. 

Allu Arjun remuneration for Pushpa 2


అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్  మారిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్  పాత్రలో కనిపించిన అల్లు అర్జున్ తన అద్భుతమైన నటనతో సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లారు. తెలుగులో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను నమోదు చేసుకుంది. తెలుగులో కూడా అద్భుతమైన కలెక్షన్లతో ఈ సినిమా రికార్డులు సృష్టించింది. ఈ నేపధ్యంలో అభిమానులు అందరూ ఈ సినిమాకి సెకండ్ పార్ట్ గా రాబోతున్న "పుష్ప: ది రూల్" గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 
 
ఈ నేపద్యంలో  స్క్రిప్ట్‌పై పని చేయడానికి సుకుమార్ తగినంత సమయం కోరుకుని, అమెరికా వెళ్లారు. అక్కడ ఆయన  ఫైనల్ డ్రాఫ్ట్‌పై పని చేస్తున్నారు. పుష్ప: ది రైజ్ హిందీ బెల్ట్‌లో ఓ రేంజిలో బిజినెస్  చేయడంతో, నిర్మాతలు బడ్జెట్‌ను పెంచడానికి అంగీకరించారు. ఈ సీక్వెల్ కోసం అల్లు అర్జున్, సుకుమార్ రెమ్యూనరేషన్ కూడా పెంచారని సమాచారం. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి వస్తున్న  అప్‌డేట్ ప్రకారం, అల్లు అర్జున్ సీక్వెల్ కోసం 100 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్‌గా కోట్ చేసాడని వినికిడి. దాంతో ఈ విషయమై  నిర్మాతలతో  చర్చలు జరుగుతున్నాయి. 

ఇక ఈ సినిమా కోసం సుకుమార్ 50 కోట్లు తీసుకుంటున్నారట. మైత్రీ మూవీ మేకర్స్  వారు...అల్లు అర్జున్ మరియు సుకుమార్ ల రెమ్యూనరేషన్ ప్రకారం ఫైనల్ బడ్జెట్‌ను లాక్ చేస్తారు. ఈ సినిమా షూటింగ్ సమ్మర్ తర్వాత ప్రారంభమవుతుంది . 2023 వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, అనసూయ, ఫహద్ ఫాసిల్, సునీల్ తమ పాత్రల్లో మళ్లీ నటించనున్నారు. ఈ సీక్వెల్ కోసం సుకుమార్ బాలీవుడ్ నటులను ఎంపిక చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు.   భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న దర్శక నిర్మాతలు ఈసారి నార్త్ మార్కెట్ లో కూడా సినిమాని భారీగా ప్రమోట్ చేసి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios