Allu Arvind:"గని" విషయమై అల్లు అరవింద్ ముందే హెచ్చరించారా?
గద్దలకొండ గణేష్ సినిమా తో మంచి హిట్ ను అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు "గని" అనే ఒక స్పోర్ట్స్ డ్రామా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
సినిమాల విషయంలో అల్లు అరవింద్ అంచనాలు తప్పవని చెప్తారు. ఆయన తన బ్యానర్ నుంచే వచ్చే సినిమాలు అన్ని జాగ్రత్తలు తీసుకుని విడుదల చేస్తూంటారు. అవసరమనుకుంటే రీషూట్స్ చేస్తారు. అందుకే అవి ఆ స్దాయి సక్సెస్ తో వెలుగుతూంటాయి. తాజాగా వరుణ్ తేజ హీరోగా వచ్చిన గని విషయంలోనూ ఆయన హెచ్చరికలు చేసారని సమాచారం. అయితే వాటిని టీమ్ పట్టించుకోలేదని అందుకే ఇవాళ సినిమా ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుందని మీడియాలో వినిపిస్తోంది. అసలేం జరిగింది
మెగా కుటుంబం నుంచి వచ్చి తనదైన స్టైల్లో నటిస్తూ..టాలీవుడ్‌లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు యంగ్ హీరో వరుణ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్‌లో కథల ఎంపిక విషయంలో కాస్త తడపడినా.. ఆ తర్వాత ఢిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా వరుణ్ చేసిన మరో ప్రయోగం ‘గని’. ఇందులో తొలిసారి బాక్సర్‌గా తెరపై కనించబోతున్నాడీ హీరో. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య శుక్రవారం (ఏప్రిల్ 8) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మార్నింగ్ షో తోటే తిరస్కరించారు. సినిమా పరమ రొటీన్ గా ఉందని పెదవి విరిచారు.
అయితే రిలీజ్ కు ముందు ఈ సినిమా చూసిన నప్పుడు అల్లు అరవింద్ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడదని, కొన్ని మార్పులు చేయడం మంచిదని సలహా ఇచ్చారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కానీ ఈ సినిమాని నిర్మిస్తున్న అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ మరియు డైరెక్టర్ కిరణ్ మాత్రం అల్లు అరవింద్ మాటలు వినలేదని చెప్తున్నారు. అప్పటికే సినిమా రిలీజ్ లేటైందని, మళ్లీ రిలీజ్ డేట్ దొరకదని...మళ్లీ మళ్లీ ఈ సినిమాని రీషూట్ చేయటం ఇష్టంలేక అలానే విడుదల చేశార్ట దర్శక నిర్మాతలు. అంతేకాకుండా ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని భావించారట. అలాగే వరుణ్ తేజ కూడా బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కానీ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ఫ్లాప్ టాక్ ను అందుకుంటుంది. డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీ నష్టాలు కలగడంతో తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం.
మరో ప్రక్క ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 50 కోట్లు అని తెలుస్తోంది. చిత్ర దర్శకుడు కిరణ్ కొర్రపాటి చాలా కాలంగా ఇండస్ట్రీలో వున్నారు కానీ దర్శకుడిగా మాత్రం ఇదే ఆయనకి తొలి సినిమా. మొదటి సినిమా డైరెక్ట్ చేస్తున్న ఒక దర్శకుడిని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టడం ఈ మధ్య కాలంలో జరగలేదు. పైగా ఈ సినిమాలో ఉపేంద్ర, జగపతి బాబు, సునీల్ శెట్టి, నదియా వంటి స్టార్ తారాగణం ఉంది. ఇక కేవలం ఐటెం సాంగ్ కోసం తమన్నాకే కోటి రూపాయిలిచ్చారని సమాచారం.
కరోనా కారణంగా సినిమాకి చాలా బ్రేకులు పడ్డాయి. ఫారిన్ నుంచి బాక్సరలని పిలిపించి అన్నపూర్ణలో సెట్ కూడా వేశాక వరుణ్ కి గాయం కావడంతో షూటింగ్ రద్దు అయింది. ఇలా చాలా కారణాల వల్ల డబుల్ బడ్జెట్ అయ్యింది. ఇలా పెరుగుతూ పెరుగుతూ చిత్ర బడ్జెట్ యాబై కోట్లకి చేరిపోయింది. వరుణ్ తేజ్ సినిమాల్లో కూడా ఇదే హయ్యెస్ట్ బడ్జెట్. సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే పర్లేదు కానీ ఈ మాత్రం తేడా కొట్టినా మాత్రం తీవ్ర నష్టాలు వస్తాయి. అయితే రూ. 50కోట్లు తిరిగి రావాలంటే 'గని' వరుణ్ కెరీర్లోనే అతి పెద్ద హిట్ అవ్వాలి. కానీ అది జరగలేదు.