వాలంటైన్స్ డే స్పెషల్.. ఒక్కో గులాబీ ఎంతకి అమ్ముతున్నారో తెలుసా?

ఇప్పుడు ఈ ఎర్రగులాబీ డిమాండ్ మరింత పెరిగింది. వాలంటైన్స్ డే రాకతో... గులాబీ ధర అమాంతం పెరిగిపోయింది. గత ఏడాదితో పోలిస్తే గులాబీల ధర 20 నుంచి 25 శాతం పెరిగింది. అయినప్పటికీ వీటి కొనుగోలు చేయడానికి మాత్రం వెనకడుగు వేయడం లేదని మార్కెట్ నిర్వాహకులు చెబుతున్నారు.

Roses to become pricier by 20-25% as demand rises ahead of Valentine's Day

ప్రేమికులకు వాలంటైన్స్ డే ఎంత ప్రత్యేకమో... గులాబి పువ్వుకి కూడా అంతే ముఖ్యం. అది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. కానీ ఫిబ్రవరి నెల వస్తే మాత్రం దాని విలువ మరింత పెరుగుతుంది. కొత్తగా తమ ప్రేమను వ్యక్తపరచాలన్నా... ఆల్రెడీ ప్రేమలో ఉన్నవారిని ఇంప్రెస్ చేయాలన్నా... రోజా పువ్వుకి మించిన గొప్ప బహుమతి మరోటి ఉండదు.

ఈ పువ్వు ఎవరినైనా మెప్పిస్తుంది. దీని మాయలో పడకుండా ఎవరూ ఉండలేరు. ఈ గులాబీలలో కూడా ఎన్నో రంగులు ఉన్నా... ఎర్ర గులాబీ వాటిలో స్పెషల్. ఎందుకంటే ప్రేమను ఎరుపు రంగుతో పోలుస్తారు.అందుకే ప్రేమకు చిహ్నంగా ఎర్రగులాబీని మాత్రమే అందిస్తారు.

ఇప్పుడు ఈ ఎర్రగులాబీ డిమాండ్ మరింత పెరిగింది. వాలంటైన్స్ డే రాకతో... గులాబీ ధర అమాంతం పెరిగిపోయింది. గత ఏడాదితో పోలిస్తే గులాబీల ధర 20 నుంచి 25 శాతం పెరిగింది. అయినప్పటికీ వీటి కొనుగోలు చేయడానికి మాత్రం వెనకడుగు వేయడం లేదని మార్కెట్ నిర్వాహకులు చెబుతున్నారు.

Roses to become pricier by 20-25% as demand rises ahead of Valentine's Day

గులాబీ పూలకు నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు మార్కెట్‌ అధికంగా ఉంటుంది. ఈ నాలుగు నెలల్లోనే గులాబీ రైతులకు భారీగా లాభాలు లభిస్తుంటాయి. నవంబర్‌ నెల నుంచి వివాహాది శుభ కార్యాలు ప్రారంభం కావడంతో గులాబీలకు భారీ డిమాండ్‌ ఉంటుంది. ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో గులాబీల విక్రయం జరుగుతుందని అమ్మకం దారులు  చెబుతున్నారు. కేవలం ఒక్క ఫిబ్రవరిలోనే పదిలక్షలకు పైగా గులాబీలు అమ్ముడౌతయని చెబుతున్నారు.

సాధారణ రోజుల్లో ఒక్కో గులాబీ ధర రూ.2 నుంచి రూ.5వరకు ఉంటుంది. కానీ ఈ ప్రేమ మాసంలో మాత్రం ఒక్కో పువ్వు ధర తక్కువలో తక్కువ రూ.10, రూ.20 నుంచి రూ.50, రూ.100 పలుకుతుంది. మరీ డిమాండ్ ఎక్కువగా ఉంటే.. ఆ పువ్వుకే కొన్ని సొగసులు అద్ది ఇంకాస్త ఎక్కువగా అమ్మేవారు కూడా ఉన్నారట. సీజన్, అవసరం అలాంటిది కాబట్టి ప్రేమికులు కూడా ఎలాంటి బేరాలు లేకుండా కొనేస్తుండటం విశేషం.
 
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios